టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు మృతి చెందిన విషయం విదితమే. 55 సంవత్సరాల వయసులోనే ఆయన మృతి చెంది సూపర్ స్టార్ కృష్ణకు పుత్ర శోకం మిగిల్చారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం దురదృష్టకరం అంటూ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ఈ క్రమంలో హఠాత్తుగా ఆయన మృతి చెందడంపై సోషల్ మీడియాలో పలు కధనాలు వస్తున్నాయి. ఓ వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకడంతో అన్నయ్య అంత్యక్రియలకు కూడా హాజరు అయ్యే పరిస్థితి లేదు.
ఈ పరిస్థితిలో రమేష్ బాబు మృతి పై అనేక కధనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్న క్రమంలో రమేష్ బాబు కూడా కరోనా వలనే మరణించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మహేష్ బాబుకి కూడా కరోనా సోకడంతో ఈ వార్తలు అందరు నిజమనే అనుకుంటున్నారు. కానీ, అసలు రమేష్ బాబుకి కరోనా సోకలేదు.
ఇప్పుడు ఎవరు చనిపోయినా కరోనా వల్లనేమో అనుకునే పరిస్థితి నెలకొంది. కానీ, రమేష్ బాబుకు గతంలో కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న టైంలో ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనే ఆయన మరణించారు. శ్వాస ఇబ్బంది ఎదురవ్వడం వల్లే ఆయన మరణించడంతో ఆయనకు కరోనా సోకిందని అభిమానులు బాధపడ్డారు.
కానీ, ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యలే ఆయన మృతికి కారణమయ్యాయి. కరోనా కారణంగా మహేష్ బాబు కూడా అన్న అంత్య క్రియలకు హాజరు కాలేకపోయారు. వాట్సాప్ కాల్ లోనే అన్న అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. రమేష్ బాబు కూడా గతంలో హీరోగా పలు సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు హీరోగా కలిసిరాకపోవడంతో.. నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించారు.







#2
#3
#5
#6
#8
#9
#11
#12
#14
#16


































