టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకున్ననటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మహావడి. మదర్ గా, అత్తయ్యగా లెక్కలేనన్ని సినిమాలు చేసి తెలుగు ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ..ఫాన్స్ కి రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు.
ఆమెకు ఓ కూతురు ఉంది అన్న సంగతి తెలుసా..? ఎఫ్ 2 సినిమాలో అండి.. ఆ సినిమాల్లో.. తమన్నా, మెహరీన్ ఇద్దరు ప్రగతికి కూతుర్లు గా నటించారు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా షూటింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రగతి మెహరీన్ తో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఎఫ్ 2 సినిమా నుంచి మా ఇద్దరి మధ్య బంధం కొనసాగుతోందని.. మెహరీన్ ను తానూ తన కూతురుగా భావిస్తున్నానని ప్రగతి చెప్పుకొచ్చారు.