దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అఖిల్ అక్కినేని మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అఖిల్ కి ఈ రోల్ బాగా సూట్ అయింది. తన ముందు సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో కూడా మెరుగయ్యారు. పూజా హెగ్డే ఇప్పటివరకు తన కెరియర్ లో పోషించని పాత్ర ఈ సినిమాలో చేశారు. ముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పూజా హెగ్డే నటన విషయంలో కూడా జాగ్రత్త వహించారు అని తెలుస్తుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగుతుంది. ఈ ఫస్ట్ హాఫ్ లోనే హీరో అక్కినేని అఖిల్ ఓ పెళ్లి చూపులకు వెళ్తాడు. ఈ పెళ్లి చూపుల్లో జరిగిన సీన్ చాలా సరదాగా ఉంటుంది. పెళ్లి చూపుల్లో ఓ అమ్మాయి, అఖిల్ ఇద్దరు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే వారి పనమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆమెను చూసిన అఖిల్, పనమ్మాయికి ఐఫోనా అని అడుగుతాడు..
అందుకు ఆ అమ్మాయి ఆ ఫోన్ తనదేనని.. కొత్త ఐఫోన్ కొనుక్కున్నాను కాబట్టి.. పాత ఫోన్ ని పనమ్మాయి కి ఇచ్చేసినట్లు చెప్తుంది. పాతబడితే.. నన్ను కూడా పనమ్మాయికి ఇచ్చేస్తారా..? అంటూ అఖిల్ అడగడంతో ఆ అమ్మాయి షాక్ అవుతుంది. ఈ సన్నివేశం తెరపై చూడడానికి చాలా సరదాగా ఉంటుంది. కానీ థియేటర్ లో మాత్రం ఈ సన్నివేశం లేదు. ఈ డిలీటెడ్ సీన్ రీసెంట్ గా గీతాఆర్ట్స్ సంస్థ పోస్ట్ చేసింది. ఈ సీన్ ఇంత బాగుంది కదా.. ఎందుకు డిలీట్ చేసారు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ డిలీటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch Video: