సాయి ధరమ్ తేజ్ హీరో గా “రిపబ్లిక్” సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ బారిన పడడం తో సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అన్న సందేహం అందరిలోను నెలకొంది. ఈ క్రమం లో సినిమా ను అనుకున్నట్లే అక్టోబర్ 1 వ తేదీనాటికి విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. కాగా, నిన్న సాయంత్రం ఈ సినిమా కు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు.

ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అయ్యి పవర్ ఫుల్ స్పీచ్ ను ఇచ్చారు. అభిమానులను ఉద్దేశించి కొంచం గట్టి గానే మాట్లాడారు. మీరేమో పవర్ స్టార్ అంటారు.. వాళ్లేమో.. నా పేరు చెప్పి ఇండస్ట్రీ ని సావదొబ్బుతున్నారు అంటారు.. అసలు దిల్ రాజు గారూ ఈ వకీల్ సాబ్ సినిమాను ఎందుకు తీశారు..? అసలు తీయకపోయి ఉంటె ఇప్పుడు అంతా బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన స్పీచ్ ను మీరు ఈ కింద వీడియో లో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=sM4j2sqbApY














