జీతు జోసెఫ్ మలయాళం లో ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్. డిటెక్టివ్ సినిమాతో తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన జీతూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. 2010లో ఇతను డైరెక్ట్ చేసిన చిత్రం మమ్మీ అండ్ మీ. ఇది మలయాళం సినీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రం. ఇక ఇతను డైరెక్షన్లో వచ్చిన సినిమా దృశ్యం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇతనికి ఎంత పాపులారిటీని తీసుకువచ్చిందంటే బాలీవుడ్లో సైతం ఈ సినిమాని తీసి సక్సెస్ కొట్టాడు. దృశ్యం సినిమా మలయాళం సినీ రికార్డులని కొత్తగా తిరగరాసింది.

అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ తన ప్రేమ కోసం సినీ ఫీల్డ్ ని వదిలేసుకున్నాడు అనే విషయం మీకు తెలుసా. ఆ కధేమిటో ఒకసారి చూద్దాం. జీతూ జోసెఫ్ తండ్రి కేరళలో పేరున్న ఎమ్మెల్యే ఇంటర్ చదువుతున్న సమయంలో జీతూ జోసెఫ్ కి అందరి కుర్రాళ్ళ లాగానే సినిమా పిచ్చి పట్టింది. ఇదే విషయం ఇంట్లో చెప్తే ముందు డిగ్రీ పూర్తి చేయు అన్నారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకసారి చర్చిలో లిండా అనే అమ్మాయిని చూసి బాగా నచ్చటంతో వెళ్లి ప్రపోజల్ చేశాడు.

అయితే ఆ అమ్మాయి లైట్ తీసుకుంది కానీ జీతూ మాత్రం సీరియస్‌గా తీసుకొని నెక్స్ట్ టైం తన పేరెంట్స్ ని తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేశాడు. అప్పుడు ఆశ్చర్య పోవడం లిండా వంతు అయింది. లైఫ్ లో నువ్వు ఏం చేస్తావు అని లిండా అడిగినప్పుడు జీతూ సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. సినిమా వాళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను కావాలో సినిమాలు కావాలో తేల్చుకో అని లిండా అడిగేసరికి ప్రేమించిన అమ్మాయి కోసం సినిమాలను వదిలేసాడు జీతూ.

కానీ పెళ్లి తర్వాత జీతూకి ఉన్న సినిమా తపన చూసిన లిండా తానే సినిమాల్లోకి వెళ్ళమని భర్తని ప్రోత్సహించింది. అప్పుడు జీతు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు, తర్వాత ఒక కథ రాసుకుని నిర్మాత దొరకక ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత జీతు జోసెఫ్ వాళ్ళ అమ్మ తన ఆస్తి ఇచ్చి సినిమా తీయమనడంతో డిటెక్టివ్ సినిమా తీసి హిట్ కొట్టాడు అక్కడి నుంచి అతని విజయప్రస్థానం ప్రారంభమైంది.













కాజల్ అగర్వాల్ నటించిన హారర్ సినిమా కరుంగాపియమ్. ఈ మూవీ కథ విషయనికి వస్తే, కార్తిక (రెజినా) ఒక పాత లైబ్రరీకి వెళుతుంది. వందేళ్ల క్రితం రాసిన ‘కాటుక బొట్టు’ అనే బుక్ కనిపిస్తుంది. దాంతో ఆమె ఆ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే ఆమె చదివే క్యారెక్టర్లన్నీ దెయ్యాలుగా కార్తిక ముందుకు వస్తుంటాయి. వాటిలో కాజల్(కార్తిక) ఉంటుంది. ఆమె పగ తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఇంతకి కాజల్ ఎలా చనిపోయింది. ఆమె తన పగను ఎలా తీర్చుకుంటుంద? ఇక రెజీనా క్యారెక్టర్ ఏమిటి అనేది మిగతా కథ.
5 కథలతో ఆంథాలజీగా రూపొందిన హారర్ సినిమా ఇది. రెజీనా క్యారెక్టర్ ద్వారా ఒక్కో స్టోరీని డైరెక్టర్ పరిచయం చేశాడు. కార్తిక ఎపిసోడ్స్‌ను సీరియస్ హారర్ స్టోరీగా తీశాడు. మిగిలిన 3 కథల్ని కామెడీ, హారర్ కలిపి ఆకట్టుకునేందుకు ట్రై చేశాడు. రెజీనాకు ఈ 5 కథలకు కనెక్షన్ ఉందని చూపించే ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్‌తోనే మూవీని ఎండ్ చేసి, పార్ట్ -2 ఉందని చూపించాడు.
కాజల్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలిచింది. ఫుచర్ ను ఊహించే శక్తి కల మహిళగా కాజల్ అగర్వాల్ ఆకట్టుకుంది. అరవ కామెడీని భరించడం కొంచెం కష్టమే. హారర్ ట్విస్ట్‌లన్నీ ఇంతకు ముందు చాలా చిత్రాలలో వచ్చినవే. కొన్ని పాత్రలు ఎందుకొస్తున్నాయో తెలియని గందరగోళంలో సినిమాను ఎండ్ చేశారు.
బాహుబలి మూవీ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతియోశక్తి లేదు. జక్కన్న దర్శకత్వ ప్రతిభ, రెబల్ స్టార్ ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ ల అద్భుతమైన నటన బాహుబలి సినిమాని బ్లాక్ బస్టర్ గా చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీల రికార్డులన్నిటిని ఈ మూవీ తిరగరాసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను క్రియేట్ చేసింది. బాహుబలి మూవీలో విగ్రహం పైకి లేపిన అనంతరం ఇంటర్వెల్ వస్తుంది. అయితే దర్శకుడు రాజమౌళి ముందుగా వేరే సీన్ దగ్గర ఇంటర్వెల్ వేయాలని అనుకున్నారంట.
అది ఏమిటంటే, దేవసేన ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగి వచ్చాడు’ అని చెప్పినప్పుడు శివుడు నడుస్తూ ఉంటే అతడిలో నుండి అమరేంద్ర బాహుబలి రూపం వస్తుంటే ఇంటర్వెల్ రావాలి. ఈ సీన్ కన్నా ముందు శివుడు నిప్పు, గాలి, భూమి, నీరు, ఆకాశం అయిన పంచభూతాలను దాటుకుని మాహిష్మతి రాజ్యంలో అడుగుపెడతాడు. అయితే ఈ సీన్ ను జక్కన్న ఇలా తీయాలని అనుకోలేదట.
మాహిష్మతి రాజ్యంలోకి వచ్చే ముందు శివుడు మంచు కొండల్లో సైనికులతో ఫైట్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడున్న ఒక సైనికుడు శివుడిని చూసి అమరేంద్ర బాహుబలి అనుకుని, ‘ప్రభూ నన్ను ఏమీ చేయొద్దు’ అంటూ వేడుకుంటాడు. ఆ తరువాత తప్పించుకుని వెళ్ళి, బిజ్జలదేవుడికి బాహుబలి గురించి చెబుతాడు. కానీ, బిజ్జలదేవుడు నమ్మకుండా ‘బాహుబలి చనిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి మట్టిలో కలిపాం’ అని చెప్పగానే శివుడు మట్టి గోడను పగుల కొట్టుకుని ఇటువైపు రావాలి.
ఆ తరువాత ‘బాహుబలి శరీరాన్ని మంటల్లో కలిపాం’ అని చెప్పగానే శివుడు మంటలను దాటి రావాలి. ఈ విధంగా బిజ్జలదేవుడు ఒక్కో డైలాగ్ చెప్తుంటే ఒక్కో స్టేజ్ ను శివుడు దాటుకుని వచ్చేలా తీయాలని, అక్కడ ఇంటర్వెల్ వేయాలని భావించారంట. అయితే విగ్రహం పైకి ఎత్తిన తరువాత ఇంటర్వెల్ వస్తే బాగుంటుందని, బిజ్జలదేవుడి డైలాగ్స్ తొలగించారు. ఇక శివుడి మాహిష్మతికి వచ్చే సీన్స్ ను ‘నిప్పులే శ్వాసగా’ అనే పాటలా తీశాం’’ అని జక్కన్న ఒక సందర్భంలో వెల్లడించారు.



