తెలుగు వారికి మరో సావిత్రి ఎవరైనా ఉన్నారా అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సౌందర్య. అతి చిన్న వయసులో ఆమె హఠాన్మరణం తెలుగు ప్రేక్షకులు ఎవరు జీర్ణించుకోలేనిది. ఆమె చేసిన సినిమాలు ఇప్పటికీ యు ట్యూబ్ లలో చూస్తూనే ఉంటున్నాం.. ఆమె లేరు అంటే మనం ఎప్పటికీ నమ్మలేమేమో. చిన్న వయసులోనే ఇండస్ట్రీ కి వచ్చి.. తక్కువ టైం లోనే టాలీవుడ్ లో అగ్రతార గా ఎదిగారు సౌందర్య.
సౌందర్య టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎలా ఎంట్రీ ఇచ్చిందో తెలుసా..? “రైతు భారతం” సినిమా తో సొందర్య సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా వాణి విశ్వనాథన్ ను ఎంచుకున్నారు. రెండో హీరోయిన్ కోసం దర్శకుడు చిట్టి బాబు వెతుకుతున్న టైం లో.. ఎడిటర్ రామయ్య బెంగళూర్ లో ఉన్న సౌందర్య గురించి చెప్పారు. ఆ టైం లో చిట్టిబాబు ఎవరికీ ఏ విషయం చెప్పకుండా సౌందర్య ఇంటికి వెళ్లారు.
ఎలాంటి మేక్ అప్ లేకుండా ఉన్న ఆమె ను చూసి తన సినిమాకి చేయాలి అని కోరాడు. అలా సౌందర్య సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యారు. ఆ తరువాత ఎంత పెద్ద స్టార్ అయ్యారో అందరికి తెలిసిందే. సౌందర్య ఎంతో ముచ్చట పడి బెంగళూర్ లో ఇల్లు కొనుక్కున్నారు. కానీ చిన్న వయసులోనే ఆమె ఈలోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఆమెకు సన్నిహితురాలు ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఈ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందొ తెలిపారు.
సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆ ఇల్లు ప్రస్తుతం భూత్ బంగ్లా తయారయిందని, ఎవరు పట్టించుకునే వారు లేరని చెప్పుకొచ్చారు. సౌందర్య మరణించిన తరువాత కొన్నాళ్ళకు ఆ ఇంటికి వెళ్లాలని.. అక్కడ ఆమె అమ్మగారు ఉంటారని అనుకున్నానని తెలిపారు. అయితే.. ఆమె అమ్మగారు అక్కడ లేరు. ఆ బంగ్లా కూడా పూర్తి గా పాడయిందని.. ఆ ఇల్లు చూడగానే అక్కడ సౌందర్య ఉన్న రోజులు జ్ఞాపకమొచ్చాయని ఆమని కళ్లనీళ్లు పెట్టుకున్నారు.