“లైగర్” స్టోరీ ఇదే అంటూ.. వైరల్ అవుతున్న ఈ ఫ్యాన్ మేడ్ స్టోరీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

“లైగర్” స్టోరీ ఇదే అంటూ.. వైరల్ అవుతున్న ఈ ఫ్యాన్ మేడ్ స్టోరీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..!

by Anudeep

Ads

సినిమాలు ఎప్పటికి పాతబడని సబ్జెక్టు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి.. వాటి గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. ఏదైనా కొత్త సినిమా రాబోతోందంటే ఆ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ ల రిలీజ్ అప్పటినుంచే రచ్చ మొదలవుతుంది. ట్రైలర్ ని, పోస్టర్ లని చూసి సినిమా స్టోరీ ని గెస్ చేసేస్తూ ఉంటారు.. అలా.. ఓ ఫ్యాన్ “లైగర్” మూవీ స్టోరీ ని చెబుతూ ఇలా ఓ పోస్ట్ ని పెట్టారు.

Video Advertisement

 

Liger vijay-devarakonda Trolls

Liger vijay-devarakonda Trolls

హీరో విజయ్ దేవరకొండ అమ్మా నాన్నలు వేర్వేరు ప్రాంతాలవారు. తండ్రి తెలుగు వాడే కాగా, తల్లి మాత్రం తమిళనాడు వారు. వీరిద్దరికి పుట్టిన విజయ్ దేవరకొండ అనుకోకుండా ముంబై కి వెళ్లి అక్కడ ఓ లోకల్ గ్యాంగ్ లో మెంబెర్ అవుతాడు. అక్కడే కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ లకు స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ విలన్ ని కలుస్తాడు. అయితే.. విలన్ ని విజయ్ దేవరకొండ హేట్ చేస్తూ ఉంటాడు. వీరిద్దరికి గొడవ వచ్చిన సమయం లోనే హీరో విజయ్ దేవరకొండ తన బాక్సింగ్ టెక్నిక్స్ తో విలన్ మనుషుల్ని బాగా కొడతాడు.
liger 2

సరిగ్గా ఇప్పుడు ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ తానొక ఫైటర్ అని.. బాక్సింగ్ తన బ్లడ్ లోనే ఉందని రియలైజ్ అవుతాడు. తనకు ఎలాంటి ట్రైనింగ్ లేకపోయినా ఇలా ఎలా బాక్సింగ్ చేయగలిగాడో తెలుసుకోవాలనుకుంటాడు. అలాంటి సమయం లోనే.. ఓ ప్రత్యేక పాత్ర వచ్చి విలన్ గురించిన ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.

liger 3

ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే.. పాతికేళ్ల క్రితం విలన్ కిక్ బాక్సింగ్ చేసేవాడు. ఛాంపియన్ గా కూడా గెలుస్తాడు. తన ఆపొనెంట్ ని మోసం చేసి, చంపేయడం ద్వారా విలన్ ఆ ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంటాడు. ఆ తరువాత విలన్ మాఫియా రంగం లోకి వచ్చి స్మగ్గ్లింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే బాక్సింగ్ పై ఉన్న మక్కువ తో బాక్సింగ్ ఫీల్డ్ కి కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా పార్టియాలిటీ చూపిస్తాడు. తాను స్పాన్సర్ చేసిన వ్యక్తే గెలిచే విధం గా ఎత్తులు వేస్తూ ఉంటాడు.

liger 4

ఈ క్రమం లో విజయ్ దేవరకొండ కి తన పేరెంట్స్ ఎవరు అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఆ తరువాత మంచి గా కోచింగ్ తీసుకుని టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో టైటిల్ ని కూడా గెలుస్తాడు. చివరికి గన్ తీసుకుని విలన్ పైన పెట్టి.. నేను చందు కొడుకుని.. క్రాస్ బ్రీడ్ ని.. లైగర్ ని అని అసలు విషయం చెప్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే.. మన హీరో “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లో చందు (రవితేజ), ముగాంబిగాంబాల్ (ఆసిన్) ల కొడుకే.. చివరగా.. ఆ ఫ్యాన్ ఏమి చెప్పుకొచ్చాడంటే.. ” ఇది కేవలం తన ఊహాజనితమైన స్టోరీ అని.. “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” సినిమా కి ఎక్స్టెన్షన్ గా అంతే ఫన్నీ గా ఈ సినిమా ను కూడా రూపొందిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పాడు.


End of Article

You may also like