సినిమాలలో అప్పుడప్పుడు ఫోన్ చేసే సందర్భాలలో ఫోన్ నంబర్లను డయల్ చేసినట్లు చూపిస్తూ ఉంటారు. సాధారణం గా చాలా సినిమాలలో మూడు, నాలుగు నంబర్లను చూపించి మిగతావి చూపించరు. కానీ.. కొన్ని సినిమాలలో కంప్లీట్ నంబర్లు చూపించేస్తూ ఉంటారు. ఇది చదవగానే మనకి ఫస్ట్ గుర్తుకు వచ్చేది శివమణి నెంబర్. ఎందుకంటే.. ఈ ట్రెండ్ అసలు సెట్ చేసిందే శివమణి.
ఈ సినిమా లో నెంబర్ ను పోస్టర్స్ వేసి మరీ చూపించారు కాబట్టి ఇది బాగా వైరల్ అయిపోయింది. అప్పట్లో చాలా మంది దీనిని ట్రై చేసారు కూడా. మీలో కూడా చాలా మంది ఉండే ఉంటారు. అలా తెలుగు సినిమాల్లో వచ్చిన 15 ఫోన్ నంబర్లపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1 శివమణి – 9848022338

#2 కృష్ణార్జున యుద్ధం – 9023258582 -రియా

#3 మిడిల్ క్లాస్ మెలోడీస్ – 9880362529 -సంధ్య

#4 ఏ మాయ చేసావే – 9849477977 -జెస్సి

#5 ప్రేమమ్ – 9763386928 -సితార

#6 గుండె జారీ గల్లంతయ్యిందే – శ్రావణి 9126123456/ శృతి: 9126126126

#7 కుమారి 21F – 9849053143 -నోయల్

#8 హలో – 9899398764 – జున్ను

#9 ఊహలు గుస గుస లాడే – 25829062 (ల్యాండ్ లైన్) – శిరీష ప్రభావతి

#10 కొత్త బంగారు లోకం – 9985678904 – బాలు

#11 డాన్ – 9890211111 – స్టీఫెన్

#12 ఓయ్ – 9999999999 – ఉదయ్

#13 బుజ్జిగాడు – 9989968834 – చిట్టి

#14 రాజా రాణి – 9884433882 – కీర్తన

#15 ఒక్కడు – 9848032919 – సుబ్రహ్మణ్యం

ఇది కూడా చదవండి :”ఛత్రపతి’ సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా ? ఇప్పుడెలా ఉన్నాడు అంటే ?








తమిళ్ లో వచ్చిన దురువంగల్ పత్తినారు (D – 16 ) సినిమా ను తెలుగు లో కూడా డబ్ చేసారు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కధాంశం. కార్తీక్ నరేన్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ లో చేరాలనుకునే ఒక యంగ్ బాయ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతం గా ఈ సినిమా ను మలిచారు.
రజినీకాంత్ యాక్షన్ సినిమా కాలా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కి రంజిత్ దర్శకత్వం వహించారు. కరికాలాన్ అవినీతి రాజకీయ నాయకులకు వ్యతిరేకం గా పోరాడుతూ ఉంటారు. ధారవి లో ప్రజల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్న విలన్ కు వ్యతిరేకం గా జరిపే పోరాటమే కాలా సినిమా. రజినీకాంత్, నానా పటేకర్ ఈ సినిమా లో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు.
తమిళ జిగర్తాండా సినిమా ను తెలుగు లో చిక్కడు దొరకడు గా డబ్ చేసారు. ఈ సినిమా 2016 లో డబ్ చేసారు. అలాగే.. తెలుగులోనే గద్దలకొండ గణేష్ పేరిట రీ మేక్ చేసారు. తమిళ నాట ఈ సినిమా మంచి పేరు సంపాదించుకుంది.
ధనుష్, అమలాపాల్ జంట గా నటించిన సినిమా విఐపి. ఈ సినిమా తెలుగు లో “రఘువరన్ బిటెక్” పేరుతొ డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు వేళ్రాజ్ దర్శకత్వం వహించారు. బి టెక్ చదివిన రఘువరన్ ఉద్యోగం దొరక్క నాలుగేళ్లు ఖాళీ గా ఉంటాడు. తనకు సరైన అవకాశం వచ్చాక సొంతం గానే కంపెనీ నడిపే స్థాయికి చేరుకొని సత్తా చాటుతాడు. ఆ తరువాత వచ్చే పరిస్థితుల్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపే సినిమా విఐపి. ఈ సినిమా హిట్ అవ్వడం తో విఐపి 2 పేరిట సీక్వెల్ ను కూడా రిలీజ్ చేసారు.


కంగనా రనౌత్ నేటికీ టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్నారు. ఏక్ నిరంజన్ సినిమా తో ఆమె తెలుగు వారికి పరిచయమైనా.. ఆ తరువాత పెద్ద గా అవకాశాలు రాకపోవడం తో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
విద్యాబాలన్ కు తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ, ఆమెకు కధానాయకుడు సినిమా హిట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆమెకు పెద్ద గా అవకాశాలు కూడా రాలేదు.
సుష్మితా సేన్ తెలుగు లో రక్షకుడు సినిమా లో నటించారు. తెలుగు నాట పెద్ద గా సక్సెస్ కాలేకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో కచ్చితం గా ఉండే పేరు ప్రియాంక చోప్రా. కానీ, ఆమె తెలుగు లో నటించిన తుఫాన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.
అతిధి సినిమా లో హీరోయిన్ గా నటించిన అమృతా రావు గుర్తుందా..? ఆ సినిమా తరువాత అమృతా రావు కు అవకాశాలేవీ రాకపోవడం తో ఆమె బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
మల్లీశ్వరి సినిమా తో కత్రినా కైఫ్ తెలుగు వారికీ పరిచయమైంది. మల్లీశ్వరి మంచి విజయాన్నే అందించింది. అయితే కత్రినా కైఫ్ నటించిన అల్లరి పిడుగు సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దానితో ఆమె బాలీవుడ్ లో సెటిల్ అయిపోయారు.
వెంకటేష్ సినిమా శ్రీను లో ట్వింకిల్ ఖన్నా హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో ఏ సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయారు.
అయేషా టాకియా సూపర్ సినిమా లో నాగ్ తో కలిసి నటించారు. ఆమె యువతను బాగా ఆకట్టుకున్నా.. అవకాశాలు రాకపోవడం తో.. ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయారు.

















