గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ ఒక్కొక్కసారి చేసే కామెంట్లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక మలయాళీ హీరోయిన్ చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఆ నటి పేరు ఆర్య… మలయాళం లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బుల్లితెర నుండి వెండితెర వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుంది. మలయాళం బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించిన విషయాలు పంచుకుంది. తన భర్త రాహుల్ సుశీలన్ తో విడిపోవడానికి గల కారణాలు చెప్పింది.

నన్ను వదిలించుకోవడానికి నా భర్త నన్ను బిగ్ బాస్ కి పంపాడేమో అనిపిస్తుంది. నేను బిగ్ బాస్ కి వెళ్లడానికి బాగా మద్దతు ఇచ్చాడు. నాకు ఒక కుమార్తె ఉంది. మా నాన్న కూడా కొద్దిరోజుల క్రితమే చనిపోయారు. బిగ్ బాస్ కి వెళ్ళమని సపోర్ట్ చేసి ఎయిర్పోర్ట్ లో దింపారు.నేను బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు నాకు పరిచయం లేరు. నేను హౌస్ నుండి బయటకు వచ్చేలోగా దూరం అవ్వాలని అతని ప్లాన్ అని నాకు తెలీదు,నేను కూడా ఇది ఒక అవకాశం గా భావిస్తున్నాను…అని చెప్పుకొచ్చింది.
కోవిడ్ కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చాక నా భర్తకు ఫోన్ చేయగా ఫోన్ కలవలేదు. ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు, నాకు తెలిసిన నెంబర్ అదొక్కటే. తర్వాత నా భర్త సోదరికి ఫోన్ చేయగా, తాను అసలు విషయం బయట పెట్టింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం లో ఉన్నాడని అప్పుడే తెలిసింది. తుపాకీతో కాల్చి చంపాలనే అంత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కోపం లేదు తనకి ఏదైనా చెడు జరిగితే వినాలని ఉంది అంటూ తన బాధను బయటపెట్టింది.

















కన్నెగంటి బ్రహ్మానందం 1956లో ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలోని చాగంటి వారి పాలెం గ్రామంలో ఫిబ్రవరి 1న జన్మించారు. ఆయన తండ్రి పేరు నాగలింగాచారి, తల్లి పేరు లక్ష్మీ నర్సమ్మ. బ్రహ్మానందం ఎనిమిది మంది పిల్లలలో ఒకరు. తండ్రి వడ్రంగి పనిచేసేవారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసి, పశ్చిమగోదావరిలోని అత్తిలిలో బ్రహ్మానందం తెలుగు లెక్చరర్‌గా చేరారు. లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో థియేటర్లో మరియు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.
నవలా రచయిత ఆది విష్ణు ఆయనని దూరదర్శన్ (డిడి) ఎన్సివి శశిధర్‌కు పరిచయం చేశారు. అలా ఆయన 1985లో డిడి తెలుగు ఛానెల్ లో ప్రసారం అయిన పకపకలు షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. అందులో లో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. షోలో ఆయన నటన చూసిన దర్శకుడు జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ అద్భుతమైన పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
గిన్నీస్ బుక్ రికార్డ్ మరియు పద్మ శ్రీతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన సోషల్ మీడియా మరియు మీమ్ కంటెంట్ మొదలైన తరువాత జిఫ్ గాడ్, గాడ్ ఆఫ్ మీమ్స్ అని పిలుస్తున్నారు. ఆయన లేకుండా మీమ్స్ ను ఊహించడం నేటి తరానికి అసాధ్యం అని చెప్పవచ్చు. ఆయన పుట్టిన రోజు(ఫిబ్రవరి 1) సందర్భంగా ఉదయం నుండి ఆయన మీమ్స్, ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అరుదైన ఫోటోలను మీరు చూసేయండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18. 

1. చిరంజీవి, సాయి ధరమ్ తేజ్:
2. వెంకటేష్ – నాగ చైతన్య:
3. నాగార్జున -సుమంత్:
4. మహేష్ బాబు – గల్లా అశోక్:
5. చిరంజీవి – వైష్ణవ్ తేజ్:
6. నాగార్జున – సుశాంత్:
7. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:
8. అల్లు అరవింద్ – రామ్ చరణ్:
9. నాగబాబు – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:
10. అర్జున్ సర్జ – చిరంజీవి సర్జ:
11. అర్జున్ సర్జ – ధృవ సర్జ:
12. ఆమీర్ ఖాన్ – ఇమ్రాన్ ఖాన్:
13. మహేష్ భట్ – ఇమ్రాన్ హష్మి:
హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు.
సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా మారి తీసిన తమిళ చిత్రం ఫైట్ క్లబ్. ఈ చిత్రంలో విజయ్ కుమార్, మోనీషా మోహన్ మీనన్ జంటగా నటించారు. ఏ రహమత్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను, 9 కోట్ల రూపాయలకు కు పైగా షేర్ ను వసూలు చేసింది. జనవరి 27 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నార్త్ చెన్నై ప్రాంతంలో సెల్వ (విజయ్ కుమార్) అనే యువకుడు ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రాంతంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళకుండా గూండాలు మరియు డ్రగ్ పెడలర్స్ గా మారుతుంటారు. అక్కడి పరిస్థితులను మార్చాలనుకునే బెంజిమన్(కార్తికేయన్ సంతానం), సెల్వ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎదగడానికి సహకరిస్తుంటాడు. రౌడీ కిర్బా (శంకర్ థాస్) బెంజీని అతని బ్రదర్ జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్)తోనే హత్య చేయిస్తాడు. ఆ తరువాత పోలీసులు జోసెఫ్ ను జైలుకు పంపిస్తారు. బెంజి మరణంతో సెల్వ జులాయిగా, రౌడీగా మారతాడు.
రౌడీ కిర్బా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. జైలు నుంచి రిలీజ్ అయిన జోసెఫ్ కిర్బా తనను మోసం చేసినట్టు గ్రహిస్తాడు. అతని పై పగ తీర్చుకోవడానికి సెల్వను వాడుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కన్న సెల్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగిలిన కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఫైట్ క్లబ్ మంచి ఛాయిస్.