నటులు అన్నాక వారు స్క్రీన్ మీద వారి పాత్ర కోసం తమని తాము ఎలా తయారు చేసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందుకే ప్రతి హీరో కూడా వారి పాత్ర కోసం కష్టపడతారు. వారిలో సీనియర్ హీరోలు కూడా ఉన్నారు.
ఒక స్టేజ్ వచ్చాక ప్రేక్షకులు తాము ఎలాంటి పాత్రలు చేసినా కూడా అంగీకరిస్తారు అనే ఆలోచనలో వాళ్ళు లేరు. ఇంత ఏజ్ వచ్చాక కూడా వారు పోషించే పాత్రల కోసం కష్టపడుతున్నారు. అలా ఇటీవల ఒక హీరో తన సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.

తనని తాను చాలా మార్చుకొని సినిమాలో చాలా కొత్తగా కనిపించారు. ఆ సినిమా కూడా ఇటీవల విడుదల అయ్యింది. ఆ సినిమా పేరు మాలైకోట్టై వాలిబన్. ఆ హీరో మరెవరో కాదు. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్. మోహన్ లాల్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్ కి పెట్టింది పేరు. మలయాళంలో ఇప్పటికి కూడా ఎంతో మంది హీరోలకి స్ఫూర్తినిచ్చే హీరోల్లో మోహన్ లాల్ ఒకరు. ఇటీవల వచ్చిన ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. ఇంకా దృఢంగా అయ్యారు.

ఇప్పుడు మరొక హీరో కూడా ఇదే బాటలో తనని తాను సినిమా కోసం మార్చుకోవడానికి సిద్ధం అయ్యారు. ఆ హీరో మరెవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న విశ్వంభర షూటింగ్ ఇటీవల మొదలు అయ్యింది. ఈ సినిమా కోసం చిరంజీవి స్పెషల్ వర్కౌట్ చేయడం మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని ఇవాళ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇందులో చిరంజీవి ఎన్నో డిఫరెంట్ రకాల ఎక్సర్సైజులు చేస్తున్నారు.
watch video :
చిరంజీవిని ప్రణయ్ సాయి ఆలకంటి అనే టైనర్ ట్రైన్ చేస్తున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి ఇలా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఎంతో మంది చిరంజీవిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. చిరంజీవికి చాలా మంది హీరోలు కూడా అభిమానులు అన్న సంగతి తెలిసిందే. వారిలో కొంత మంది కూడా చిరంజీవి పోస్ట్ కి కామెంట్స్ చేస్తున్నారు.
watch video :
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024
ALSO READ : పార్ట్ 1 సూపర్ హిట్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది..! అసలు ఏం ఉంది ఇందులో..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణి నటించిన ‘నెరు’ మూవీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కీలక పాత్ర సారా మహమ్మద్. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. చూపు లేని అమ్మాయి పాత్రలో అనశ్వర రాజన్ అద్భుతంగా నటించింది. ఆమె నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది.
కంప్లీట్ స్టార్ గా పేరుగాంచిన మోహన్ లాల్ తో నటించడం అంత సులభమైన విషయం కాదు. అయితే అనశ్వర పాత్ర మోహన్ లాల్ తో పాటు ట్రావెల్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు మళ్లించడంలో విజయం సాధించింది. అందువల్లే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరా అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఆమె కేరళలో ‘కరివెల్లూర్’ అనే టౌన్ లో 2002లో సెప్టెంబరు 8న జన్మించింది. అక్కడే పెరిగింది.
అనశ్వర 2017లో ‘ఉదాహరణం సుజాత’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. 2019 లో తన్నీర్ మథన్ దినంగల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. పలు చిత్రాలలో నటించి, ఫాలోయింగ్ ను పెంచుకుంది. మలయాళ యంగ్ హీరోలకు మొదటి ఆప్షన్ గా నిలిచింది. యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. నెరు మూవీతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రం ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లోస్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం లాంటి సీరియల్ టో పోటీ పడిన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది. సీరియల్ లోని హీరోహీరోయిన్లకు ధీటుగా జగతి మేడం పాత్రలో జ్యోతి రాయ్ ఆకట్టుకున్నారు. తన కట్టు బొట్టు, హుందాతనంతో ఆడియెన్స్ ని ఫిదా చేశారు. అయితే ఈ పాత్ర మరణించింది. ఆమె లేని సీరియల్ ని ఆడియెన్స్ చూడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫహోటవలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
సీరియల్ చాలా హుందాగా ఉండే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం గ్లామర్, హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. ఆ మధ్య పర్సనల్ విషయాలతో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ తో పాటు, పలు కన్నడ చిత్రాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర చేసిన జ్యోతి బయట ట్రెండీ వేర్స్ ధరించి, యంగ్ గా కనిపిస్తుంది. ఆమె ఏజ్ ఎంత అని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు.
తాజాగా అభిమనులతో చిట్ చాట్ చేసిన జ్యోతి రాయ్ ని ‘మీ ఏజ్ ఎంతో చెప్పగలరా’ అని అడుగగా, పాన్ కార్డ్ లో పుట్టిన తేదీని చూపించింది. అందులో 1994లో జన్మించినట్టు ఉంది. అంటే జ్యోతి ఏజ్ 30 సంవత్సరాలే కావడంతో షాక్ అవుతున్నారు. తల్లి పాత్ర చేయడంతో ఆమె వయసు ఎక్కువగా ఉంటుందని భావించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.










ఇక కథ విషయానికి వస్తే, అనుపమ(ప్రియమణి) అమాయకపు గృహిణి. ఆమె ఒక అపార్ట్మెంట్ లో భర్త మోహన్, కొడుకు వరుణ్‌తో కలిసి నివసిస్తుంటుంది. యూట్యూబ్‌లో సొంత కుకింగ్ ఛానెల్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటలు చేస్తుంటుంది. అయితే ఆమెకు ఇతరుల ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎప్పుడూ కిటికీలోంచి ఇతరులను గమనిస్తూ, అపార్ట్మెంట్ లో పనిచేసే పనిమనిషి శిల్ప నుండి వారి విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది.