“హనుమాన్” 19 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.? ఎంత లాభాల్లో ఉందంటే.?

“హనుమాన్” 19 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.? ఎంత లాభాల్లో ఉందంటే.?

by Mounika Singaluri

Ads

సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ. చాలా సినిమాలు సంక్రాంతికి విడుదల అవుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే విడుదల అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో పాన్-ఇండియన్ సినిమాగా విడుదల అయ్యి హిట్ సాధించిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

Video Advertisement

రిలీజ్ అయ్యి 19 రోజులవుతున్న కూడా హనుమాన్ మూవీ సందడి ఎక్కడా తగ్గలేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లు కలెక్షన్ సాధించింది. 2024 లో 200 కోట్లు కలెక్షన్ సాధించడం మొదటి భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.250 కోట్ల పైనే గ్రాస్ ను కొల్లగొట్టి రూ.130 కోట్ల మార్క్ ను దాటేసి రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ జోరు ఇంకా తగ్గలేదు.

వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 19 రోజుల్లోనే ఈ సినిమా రూ.140.88 కోట్లు షేర్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా రూ.140.88 కోట్ల లాభాలను అందించింది.

ఈ సినిమాకి రెండవ భాగం అయిన జై హనుమాన్ కూడా 2025 లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ఇప్పటికే ప్రకటించారు.మొదట తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చాక స్క్రీన్స్ పెంచారు. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి నిర్మించారు.మొదట తక్కువ స్క్రీన్స్ లో విడుదల అయిన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చాక స్క్రీన్స్ పెంచారు. అయితే అంత లాభాలు వచ్చినా కానీ ఆ లాభాల్లో కొంత వరకు కూడా నిరంజన్ రెడ్డికి రాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని మైత్రి డిస్ట్రిబ్యూషన్స్ సొంతం చేసుకుంది. హిందీ విషయంలో కూడా ఇదే పని చేసినట్టు సమాచారం.

Also read: హనుమాన్ సినిమాని పొగిడిన చిలుకూరు బాలాజీ అర్చకుడు….!

 


End of Article

You may also like