టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన శ్రీ లీల ఇందులో ఒకరు. ప్రస్తుతం ఏ సినిమా చూసినా అందులో హీరోయిన్ శశ్రీ లీల ఉండడం ఆమె సక్సెస్ కు నిలువెత్తు నిదర్శనం. రేపు సంక్రాంతికి గుంటూరు కారం అంటూ మహేష్ తో కలిసి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి వచ్చిన ఓ మై బేబీ అంటూ సాగే సాంగ్ ప్రోమో లో గ్రీన్ కలర్ లంగావోణిలో శ్రీ లీల రచ్చ పుట్టించే విధంగా ఉంది. పదహారణాల తెలుగింటి ఆడపడుచులా.. అందంగా ఉన్న శ్రీ లీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ లీల ను ఆర్తి అగర్వాల్ లా కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి ఎన్ని పోలికలో చూడండి అంటూ..మీమ్స్ కూడా చేస్తున్నారు. ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ అమ్మే..ఈ అమ్మగా వచ్చింది అని సినిమా డైలాగులు పెట్టి మురిసిపోతున్నారు కొందరు అభిమానులు.
https://www.instagram.com/reel/CqU3H7BJ9Vp/
ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమా తోటే ఆమె ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.. దాంతో వరుస ఆఫర్లతో చాలా బిజీ అయిపోయింది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు అందుకున్న ఈ బ్యూటీ సడన్‌గా బొద్దుగా తయారవడంతో ఆఫర్లు వెంటనే తగ్గిపోయాయి.. ఆ తరువాత బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి.. ఆఖరికి సర్జరీ కూడా చేయించుకుంది. అది కాస్త వికటించడంతో.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.











హాయ్ నాన్న మూవీ ఓ తండ్రి, కూతుర్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరి అని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తుంటే హీరో వైఫ్ చనిపోవడం, అతనికి ఒక పాప ఉండడం, ఆ పాపకి హీరోయిన్ ఫ్రెండ్ కావడం వంటి సీన్స్ కనిపించాయి. ఇక ఈ గ్లింప్స్ లో నాని కూతురిగా నటించిన పాప పేరు కియారా ఖన్నా.
ఆమె పలు వాణిజ్య ప్రకటనలలో నటించింది. థాంక్ గాడ్, బందాసింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ సినిమాలలో నటించింది. కియారాకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తన అక్క మైరాతో కలిసి ఉన్న వీడియోలను షేర్ చేస్తుంది.
కియారా ఖన్నా తల్లి పేరు శివాని జె ఖన్నా. ఆమె తన పిల్లల పేర్లతో నిర్వహిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 328 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన పిల్లలు మైరా మరియు కియారా ఖన్నా నటించిన వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. కియారా ఖన్నా మాక్స్ స్ప్రింగ్ యాడ్, క్లబ్ మహీంద్రా మరియు కెన్‌స్టార్ వంటి పలు యాడ్స్ లో నటించింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ లో ఈ యాడ్స్ ను చూడవచ్చు.







