భారత్ లో చాలామంది ముస్లింలు హిందువులుగా మారారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారు. హిందూ మతంలోకి మారిన వీరు జీవితాంతం వరకు హిందువుగా ఉండిపోయారు.
హిందూమతంలోకి మారిన ప్రముఖులలో కొందరు ఆధ్యాత్మిక మరియు ధార్మిక రంగాల్లో విజయవంతంగా కొనసాగారు. అయితే ముస్లిం నుండి హిందూ మతంలోకి మారిన ఆ ప్రముఖులు ఎవరో? ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1. ఖుష్బూ:
ప్రముఖ నటి ఖుష్బూ ఎన్నో సౌత్ చిత్రాలతో పాటు హిందీలో నటించి స్టర్ హీరోయిన్ గా రాణించారు. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె బాలనటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ చ్చిన తరువాత ఖుష్బూగా పేరు మార్చారు. తమిళ హీరో, డైరెక్టర్ సుందర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత మతాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
2. హ్యాపీ సల్మా వనసరి:
ఇండోనేషియాలో ప్రముఖ హీరోయిన్ అయిన హ్యాపీ సల్మా వనసరి. ఆమె హీరోయిన్ మాత్రమే కాకుండా రచయిత్రి, మోడల్. జన్మతహా ముస్లిం అయిన హ్యాపీ హిందూ మతంలోకి మారారు.
3. నర్గీస్:
అలనాటి బాలీవుడ్ అగ్ర హీరోయిన్ నర్గీస్ ముస్లిం. ఆమె అసలు పేరు ఫాతిమా రషీద్. నర్గీస్ సునీల్ దత్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత హిందూ మతాన్ని స్వీకరించారు.
4. జుబేదా బేగం:
బాలీవుడ్ అలనాటి నటి జుబేదా బేగం మహారాజా నార్సింగిర్ ధన్ రాజ్ గిర్ జ్ఞాన్ బహదూర్‌ను పెళ్లి చేసుకున్న తరువాత హిందూ మతాన్ని స్వీకరించారు.
5.శ్రీ మధుకర్ నాథ్:
సత్సంగ్ ఫౌండేషన్‌కు నడిపిస్తున్న పద్మ భూషణ్ శ్రీ మధుకర్ నాథ్ హిందూ మతం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గదర్శి, హిందూ భారతీయ యోగి, వక్త , విద్యావేత్తగా మారారు.
6. ఆశిష్ ఖాన్ దేవ్ శర్మ:
గ్రామీ అవార్డు గ్రహీత ప్రసిద్ధ సరోద్ సంగీతకారుడు ఆశిష్ ఖాన్ దేవ్ శర్మ 2006లో హిందూ మతమలోకి మారారు.
7. అన్నపూర్ణాదేవి:
పండిట్ రవిశంకర్ మొదటి భార్య అన్నపూర్ణాదేవి కూడా ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత ఆమె హిందూమతాన్ని స్వీకరించారు.
8. హరిదాస్ ఠాకూర్:
15వ శతాబ్దంలో ప్రసిద్ధ సాధువు హరిదాస్ ఠాకూర్. ఆయన హరే కృష్ణ భక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. ముస్లిం అయినా చిన్నతనం నుంచి కృష్ణభక్తి వైపు ఆసక్తి చూపేవారు.
9. వసీం రిజ్వీ:
యూపీ షియా వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసీమ్ రిజ్వీ గత ఏడాది హిందూ మతంలోకి మారారు. ప్రస్తుతం ఆయన పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగి.
Also Read: 37 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళకి అయోధ్యలో ఇంత గౌరవం ఇస్తున్నారు..! వీళ్ళు ఎవరో తెలుసా..?








2010 ఏప్రిల్‌లో షోయబ్ మాలిక్, సానియా మీర్జాల పెళ్లి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో వీరి వివాహం పై పెద్ద ఎత్తున్న చర్చలు జరిగాయి. ఈ జంటకు కుమారుడు ఇజాన్ 2018లో జన్మించారు. సానియా, మాలిక్ మధ్య విభేదాలు వచ్చినట్టు రెండు సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇజాన్ సానియా దగ్గరే దుబాయ్ లో ఉండగా, షోయబ్ మాలిక్ ఎక్కువగా పాక్ లో ఉంటున్నాడు. విడాకుల పై ఇద్దరు బహిరంగంగా మాట్లాడలేదు.
కానీ నెట్టింట్లో క్రిప్టిక్ పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే విడాకులు ఇంకా కష్టం అంటూ సానియా పోస్ట్ షేర్ చేసింది. దాంతో విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇంతలోనే సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. సనా జావేద్‌ను పాకిస్థాన్ కు చెందిన నటి మరియు మోడల్.
ఆమె 2012లో ‘షెహర్-ఎ-జాత్’ తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తరువాత అనేక సీరియల్స్‌లో నటించింది. 2017లో డానిష్ మెహ్రునిసా వి లబ్ యు అనే సోషియో-కామెడీ మూవీతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. అనేక చిత్రాలలో నటించిన సన ఎన్నో అవార్డులు అందుకుంది. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది. 2023లో నవంబర్ 28న అతనికి విడాకులు ఇచ్చింది. తాజాగా షోయబ్ మాలిక్‌ని రెండవ సారి పెళ్లి చేసుకుంది. మాలిక్, సనా జావేద్ రిలేషన్ లో ఉన్నారని గత ఏడాది నుండి రూమర్లు వస్తున్నాయి.







బాలీవుడ్ లో గోల్మాల్, సింగమ్ సిరీస్, సింబ, సూర్యవంశీ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, నికితిన్ ధీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విహాయనికి వస్తే, దేశరాజధాని డిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరగడంతో ఢిల్లీ పోలీసులు షాక్ అవుతారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన కమిషనర్ అయిన విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ అయిన కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) లకు పేలుళ్లకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తారు. గుజరాత్ ఏటీఎస్ చీఫ్ అయిన తారా శెట్టి (శిల్పా శెట్టి) టెర్రరిస్టులను పట్టుకోవడంలో కబీర్ మరియు విక్రమ్ బక్షికి సహాయం చేస్తుంది. అసలు బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జరార్ హైదర్ (మాయాంక్ టాండన్) కు పేలుళ్లకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసును కబీర్, విక్రమ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
రోహిత్ శెట్టి చిత్రాలలోని హీరోల తరహాలోనే సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పాత్రలు ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి పాత్ర కూడా అలానే ఉంటుంది. నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ మరియు ఛేజింగ్ సీన్స్ చక్కగా రూపొందించబడ్డాయి.















