రివ్యూ : ఇండియన్ పోలీస్ ఫోర్స్..! “శిల్పా శెట్టి” నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?

రివ్యూ : ఇండియన్ పోలీస్ ఫోర్స్..! “శిల్పా శెట్టి” నటించిన ఈ సిరీస్ ఎలా ఉందంటే..?

by kavitha

Ads

ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి తెలిసిందే. ఓటీటీలు ప్రతి వారం సరికొత్త వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నాడు ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది.

Video Advertisement

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ఈ వెబ్ సిరీస్ కి బాలీవుడ్‌ డైరెక్టర్ రోహిత్ శెట్టి, సుష్వంత్ ప్రకాష్‌ లు  దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ లో గోల్‌మాల్, సింగమ్ సిరీస్, సింబ, సూర్యవంశీ వంటి సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు రోహిత్ శెట్టి.  ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించాడు. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, నికితిన్ ధీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విహాయనికి వస్తే, దేశరాజధాని డిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరగడంతో ఢిల్లీ పోలీసులు షాక్‌ అవుతారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన కమిషనర్ అయిన  విక్రమ్ బక్షి (వివేక్ ఒబెరాయ్), డిప్యూటీ కమిషనర్ అయిన కబీర్ మాలిక్ (సిద్ధార్థ్ మల్హోత్రా) లకు పేలుళ్లకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యతను అప్పగిస్తారు. గుజరాత్ ఏటీఎస్ చీఫ్ అయిన తారా శెట్టి (శిల్పా శెట్టి) టెర్రరిస్టులను పట్టుకోవడంలో కబీర్ మరియు విక్రమ్ బక్షికి సహాయం చేస్తుంది. అసలు బాంబు పేలుళ్ల వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? జరార్ హైదర్‌ (మాయాంక్ టాండన్) కు పేలుళ్లకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కేసును కబీర్, విక్రమ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
indian police force reivewరోహిత్ శెట్టి చిత్రాలలోని హీరోల తరహాలోనే  సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ పాత్రలు ఉంటాయి. ఇక పోలీస్ ఆఫీసర్ శిల్పా శెట్టి పాత్ర కూడా అలానే ఉంటుంది. నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్స్ మరియు ఛేజింగ్ సీన్స్ చక్కగా రూపొందించబడ్డాయి.

Also Read: సైలెంట్ గా రిలీజ్ అయ్యి మరొక సెన్సేషన్ అయ్యింది..! ఈ సినిమా చూశారా..?

 


End of Article

You may also like