చాలా మంది వారి రోజుని టీ తో మొదలుపెడతారు. టీ లేకపోతే ఏ పని చేయలేరు కూడా అయితే టీ కి అలవాటు పడిపోయి.. రోజుకి చాలా సార్లు టీ తాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏ ఆహార పదార్థానైనా సరే లిమిట్ గా తీసుకుంటూ ఉండాలి. టీ ని కూడా లిమిట్ గానే తీసుకోవాలి. టీ ని అతిగా తీసుకుంటే అనర్ధాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మరి టీ ని అతిగా తీసుకుంటే ఎటువంటి అనర్ధాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టీ ని ఎక్కువగా తీసుకుంటే కచ్చితంగా ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీ నిజానికి పలు రకాల ప్రయోజనాలని కూడా కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి టీ సహాయపడుతుంది. అంటువ్యాధులతో కూడా టీ పోరాడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రయోజనాలని టీ ద్వారా పొందొచ్చు. కానీ లిమిట్ దాటితే మాత్రం ఈ సమస్యలు తప్పవు.
#1. కిడ్నీలో రాళ్లు:
అతిగా టీ ని తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు కలుగుతాయి ఈ సమస్యతో బాధపడాలి కాబట్టి టీ ని లిమిట్ గానే తీసుకోవడం మంచిది. లేకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
#2. ప్రోస్టేట్ క్యాన్సర్:
రోజుకి ఐదుసార్లు కంటే ఎక్కువ సార్లు టీ ని తీసుకోవడం వలన ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#3. ఎముకలు పట్టుత్వంలో సమస్యలు:
ఎక్కువసార్లు రోజు టీ తాగడం వలన ఎముకల పట్టుత్వంలో సమస్యలు ఏర్పడతాయి త్వరగా ఎముకలు అరిగిపోతాయి కూడా.
#4. ఐరన్ పై ఎఫెక్ట్:
శరీరంలో ఉండే ఐరన్ పై కూడా నెగిటివ్ ప్రభావాన్ని టీ చూపిస్తుంది.
#5. జీర్ణవ్యవస్థలో సమస్యలు:
టీ ని అతిగా తీసుకోవడం వలన ఎసిడిటీ పెరిగిపోతుంది. అలానే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మోతాదుకు మించి టీ ని అసలు తీసుకోకండి. లేకపోతే ఈ సమస్యల బారిన పడి సతమతం అవ్వాల్సి ఉంటుంది.