ఒక్కొక్క సారి మనకి పంటి నొప్పి ఉంటుంది. అటువంటప్పుడు నిజంగా ఎలా తగ్గించుకోవాలో కూడా తోచదు. తీవ్రమైన నొప్పి కలగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే ఎప్పుడు తగ్గుతుందని చూస్తూ ఉంటాం. అయితే దంతాలు పుచ్చుకోవడం కానీ నోరు శుభ్రంగా లేక పోవడం కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా దంతాలు నరాలు ఎఫెక్ట్ అవుతాయి. దీనితో పంటి నొప్పి వస్తుంది.
అయితే ఒకవేళ మీకు పంటి నొప్పి వచ్చిందంటే ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. సులభంగా ఈ చిట్కాలను పాటించి పంటి నొప్పి నుండి బయట పడండి.
పంటి నొప్పి తగ్గాలంటే ఒక స్పూను ఉల్లి రసం తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి ఈ రెండింటినీ బాగా కలిపి పంటి నొప్పి ఉన్న చోట పెట్టండి. పంటి నొప్పి కనుక ఎక్కువగా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక మొదటి దశ లోనే ఉంటే ఇంటి చిట్కాలను పాటించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఇలా మీరు పంటి మీద పెట్టడం వల్ల నొప్పి తగ్గి రిలీఫ్ కలుగుతుంది.
లేదంటే మీరు రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని అందులో నాలుగు లవంగాలు మెత్తని పేస్టులాగ చేసి ఎక్కడైతే నొప్పి కలుగుతుందో ఆ ప్రదేశములో పెట్టండి. ఇలా చేసినా కూడా చిటికెలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రెండు చిట్కాలలో ఏదో ఒక దాన్ని ఫాలో అయితే కచ్చితంగా త్వరగా నొప్పి తగ్గుతుంది.
అలానే పంటి నొప్పిని తగ్గించడానికి ఈ చిట్కా కూడా మంచిదే. అదేమిటంటే గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలిస్తే సరిపోతుంది. వెంటనే సమస్య కూడా తగ్గుతుంది. కనుక ఈ విధంగా అనుసరించి పంటి సమస్య నుండి బయట పడండి.