షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత ఇన్సులిన్ తీసుకోవాలో తెలుసా..? ఎప్పుడు తీసుకోవాలంటే..?

షుగర్ పేషెంట్స్ రోజుకు ఎంత ఇన్సులిన్ తీసుకోవాలో తెలుసా..? ఎప్పుడు తీసుకోవాలంటే..?

by Anudeep

Ads

మారుతున్న రోజులలో అనారోగ్యాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. మనుషుల్లో చాలా కామన్ గా వచ్చే ఆరోగ్య సమస్యల్లో షుగర్ ఒకటి. షుగర్ వ్యాధికి వయసుతో సంబంధం లేదు. చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇది హెరిడిటరీ గా వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ అంటే బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది మనం తినే దాని మీద ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ లో టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని రెండు రకాలు ఉన్నాయి.

Video Advertisement

వైరస్ వల్ల, లేదా బీటా సేల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది అని, శరీరం ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అయినప్పుడు, లేదా పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయనప్పుడు, ఇంకా ఓవర్ వెయిట్ వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది అని అంటారు.

artificial pancrease 1

డయాబెటిస్ రావడం వలన ప్యాంక్రియాస్ సరైన మొత్తంలో ఇన్సులిన్ ను విడుదల చేయలేవు. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తరచూ మారుతూ ఉంటాయి. వీటిని అదుపులో ఉంచుకోవడానికి షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఎంత శాతం ఇన్సులిన్ ను తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. ఇకపై ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ ఇన్సులిన్ డెలివరీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

artificial pancrease 2

ఈ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ లేదా క్లోస్డ్ లూప్ సిస్టమ్స్ అని పిలుస్తారు. శరీరంలోని ప్యాంక్రియాస్ చేసే సహజమైన పనినే ఈ డివైస్ కూడా చేస్తుంది. ఈ డివైస్ ను కంటిన్యూస్ గ్లూకోస్ మానిటర్, ఇన్సులిన్ పంప్, స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేస్తుంటారు. ఇన్సులిన్ పంప్ ను వాడడం 1980 లోనే వాడడం మొదలుపెట్టారు. కానీ దానిని మాన్యువల్ గా వాడాల్సి రావడంతో ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయి.

artificial pancrease 3

అయితే ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ డివైస్ శరీరంలో చక్కర స్థాయిని ఆటోమేటిక్ గా కాలిక్యులేట్ చేస్తుంది. దీని ద్వారా మీరు రోజులో ఎంత ఇన్సులిన్ అవసరమవుతుంది..? ఎప్పుడు అవసరం అవుతుంది అనేది అంచనా వేయవచ్చు. చాలా మంది ఇప్పటికీ ఇన్సులిన్ శాతం గురించి భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఈ డివైస్ ఎంతగానో ఉపకరిస్తుంది.


End of Article

You may also like