రిలేషన్ షిప్ కి సంబంధించి చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేయడం వల్ల రిలేషన్ షిప్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే చాలా మంది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని నమ్ముతూ ఉంటారు. మొదట చూసినప్పుడు కలిగే ఇంప్రెషన్ ఆఖరి వరకు ఉంటుందని అంటారు.
అందుకనే మొదటిసారి మంచి ఇంప్రెషన్ ని కలిగించుకోవాలి. ఒకవేళ కనుక మొదటిసారి మంచి ఇంప్రెషన్ కలగకపోతే ఇంక ఎప్పటికీ కలగదు అని గుర్తు పెట్టుకోండి. అందుకే మొదట మీరు మీ ప్రియుడిని కానీ ప్రేయసిని కానీ కలిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగులు వేయాలి.
ఏదైనా అనుమానం కలిగితే ఇంప్రెషన్ మొత్తం పోతుంది. చిన్న తప్పే బ్యాడ్ ఇంప్రెషన్ ని కలిగించచ్చు. ఒకవేళ కనుక మంచి ఇంప్రెషన్ ని మీరు పొందాలంటే వీటిని అస్సలు మర్చిపోకండి. మరి అవేమిటో చూసేద్దాం.
తినేటప్పుడు బాగా తినండి:
ఎప్పుడైనా సరే మొదటి సారి ఎవరినైనా కలుస్తుంటే తినేటప్పుడు మంచిగా ప్రవర్తించండి మీ ఈటింగ్ హ్యాబిట్స్ చాలా ముఖ్యం. స్పూన్ సౌండ్ రాకుండా తినడం, నములుతుంటే శబ్దం రాకుండా చూసుకోవడం. సరిగ్గా టేబుల్ మీద ఉండే వస్తువులు ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇవి వారికి మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తాయి.
మంచిగా మాట్లాడటం:
జాగ్రత్తగా మాట్లాడండి. హృదయానికి నొప్పించే మాటలు మాట్లాడితే ఇంప్రెషన్ మొత్తం పోతుంది చక్కగా మాట్లాడితే ఇంప్రెస్ అవుతారు. చక్కటి పదాలను ఉపయోగించండి. అలానే మీకు నచ్చినట్టుగా ప్రశ్నలు వేయద్దు. ఇంప్రెస్ చేసేయాలని మీరు అతి చెయ్యద్దు. ఫ్లర్టింగ్ చేస్తున్నట్టు కూడా మాట్లాడద్దు.
ఎక్కువ మాట్లాడకండి:
ఎక్కువగా మాట్లాడటం కంటే ఎక్కువగా వినడం మంచిది. అతిగా మాట్లాడితే విసుగు వస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలా కనుక మీరు ఈ జాగ్రత్తలను తీసుకుంటే ఎవరినైనా ఫిదా చేసేయచ్చు. లేదంటే బ్యాడ్ అయ్యి పోతారు చూసుకోండి.