శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం ద్వారా మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం తెలియని వారికి కూడా పరిచయం అయింది. ఆయన చేసిన సాహసం విలువేంటో దేశం మొత్తం తెలిసింది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 1977, మార్చి 15న కేరళ రాష్ట్రంలో ఉన్న కోజికోడ్ జిల్లా చెందిన తిరువన్నూర్ గ్రామంలో ఉన్ని కృష్ణన్ నాయర్, ధనలక్ష్మి ఉన్నికృష్ణన్ దంపతులకు జన్మించారు. సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఇస్రోలో ఆఫీసర్ గా పని చేసేవారు.
సందీప్ ఉన్నికృష్ణన్ బెంగళూరులోని ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత 1995లో ISC సైన్స్ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ చదివే కాలంలోనే సైన్యంలో చేరాలని అనుకున్నారు సందీప్ ఉన్నికృష్ణన్. సైన్యంలో చేరాలనే ఉద్దేశంతో Crew cut స్కూల్లో గ్రాడ్యుయేషన్ చదివే టైం లోనే క్లాసులకు అటెండ్ అయ్యారు. 1995 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో జాయిన్ అయ్యారు సందీప్ గారు.
బీహార్ రీజిమెంట్ బేటాలియన్ 7 లో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు సందీప్ ఉన్నికృష్ణన్. 1999లో పాకిస్తాన్ సైనికులు భారీ ఫిరంగులు మరియు ఆయుధాలు కాల్పులు జరిపినప్పుడు ఆపరేషన్ విజయ్ లో పాల్గొని ఫార్వర్డ్ పోస్ట్ లో పని చేశారు సందీప్ ఉన్నికృష్ణన్. 1999 డిసెంబర్ 31 న సాయంత్రం ఆరుగురు సైనికులు ఉన్న బృందానికి నాయకత్వం వహించి, 200 మీటర్ల దూరంలో ఉన్న ప్రత్యర్థుల్ని ప్రత్యక్షంగా పరిశీలించి కాల్పులు జరిపి విజయం సాధించారు. 2003 జూన్ 12న సందీప్ గారి సేవలకు గౌరవంగా కెప్టెన్ గా ప్రమోషన్ అందుకున్నారు. 2005 జూన్ 13న మేజర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. 26 నవంబర్ 2008 లో జరిగిన ముంబై దాడులలో సందీప్ ఉన్నికృష్ణన్ వీర మరణం పొందారు.
1999లో మిలటరీ అకాడమీలో జరిగిన సందీప్ ఉన్నికృష్ణన్ పైపింగ్ వేడుకలలో అప్పటిలో తన తల్లి ధరించినా చీరను తిరిగి 23 సంవత్సరాల తర్వాత మేజర్ ప్రీమియర్ కోసం తన బిడ్డ జ్ఞాపకార్థం ఆ మాతృమూర్తి మరలా తిరిగి అదే చీరలు ధరించారు.
https://www.instagram.com/p/CeX2-UGNxXh/?igshid=YmMyMTA2M2Y=