ఏ అమ్మాయికైనా అమ్మతనం అనేది వరం. వద్దు అనుకునే వారి సంగతి పక్కన పెడితే.. కావాలని కోరుకునే వారు తాము గర్భవతి అయ్యామని తెలియగానే మురిసిపోతారు. ఆమె భర్త తో పాటు కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో సందడి చేస్తారు.
భార్య గర్భం ధరించినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త కూడా కొన్ని పనులను చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1. భార్య గర్భవతి అయ్యాక కనీసం ఆరు నెలల పాటు భర్త షేవింగ్ కానీ, హెయిర్ కటింగ్ కి కానీ వెళ్లకూడదట.
#2. అలాగే ఆ సమయంలో భర్త సముద్ర స్నానానికి వెళ్లడం కాని, చెట్లు నరకడం కానీ చేయకూడదట. ఇలా చేస్తే అరిష్టం సంభవిస్తుంది.
#3. భార్య ప్రెగ్నంట్ గా ఉన్న టైం లో భర్త విదేశీ యాత్రలు చేయకూడదట. ఆమెకు దూరంగా ఎక్కడకీ వెళ్లకూడదట.
#4. భార్య గర్భంతో ఉన్న సమయంలో 7 వ నెల దాటినా తరువాత తీర్థయాత్రలకు వెళ్లడం కూడా మంచిది కాదట. పడవలను కూడా ఎక్కకూడదట.
#5. అలాగే, స్మశానాలకు వెళ్లడం, శవాలను తీసుకువెళ్లే అంతిమ యాత్రలలో పాల్గొనడం వంటివి చేయకూడదట.
#6. భార్య గర్భం దాల్చాక పర్వతారోహణ చేయకూడదట. ఇంటి స్థంబానికి ముహూర్తం పెట్టించడం వంటి పనులు చేయకూడదట. వాస్తుకర్మకి దూరంగా ఉండాలట. గృహ ప్రవేశం కూడా చేయకూడదట.
#7. శవయాత్రలో పాల్గొనడం, ప్రేత కర్మలు చేయడం, పిండదానం చేయడం వంటి పనులు కూడా చేయకూడదట.
అయితే.. భార్య గర్భవతిగా ఉన్నపుడు ఆమె ఏది కోరుకుంటే.. అది తీసుకొచ్చి ఇవ్వాలట. అప్పుడే ఆమె సంతోషంగా ఉండి.. ఆమెకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఆ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే భర్త తో సహా కుటుంబ సభ్యులు అందరు కలిసి ఆమెకి సహకరించాల్సి ఉంటుంది.