పవిత్ర కార్తీక మాసంలో జ్వాలాతోరణం కార్యక్రమానికి విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి వేల అన్ని శివాలయాల్లో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శివాలయం ఎదురుగా రెండు కర్రలను నిలువుగా పాతుతారు. ఒక కర్రను అడ్డంగా కట్టి దానికి కొత్త గడ్డిని చుడతారు. దీనిని యమద్వారం అని పిలుస్తారు. ఈ నిర్మాణం పైన నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుండి పరమ శివున్ని పల్లకిలో మూడు సార్లు అటు ఇటు ఊరేగిస్తారు.
జ్వాలా తోరణం కింద శివుడి పల్లకి పక్కనే భక్తులు నడుస్తారు. పరమశివ ఇప్పటివరకు నేను చేసిన తప్పులన్నీ ఈ మంటల్లో ఖాళీ బూడిద అవ్వాలి. వచ్చే ఏడాది వరకు నేను ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గ బాటలోనే నడుస్తాను అంటూ ప్రతిజ్ఞ చేస్తారు.
జ్వాలతోరణం కాలిపోగా ఆ గడ్డివాము బూడిద తీసుకువచ్చి ఇంటి దగ్గర ఉన్న గడ్డివాములో గాని, ధాన్యా గారాల్లో గాని ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. జ్వాలా తోరణం దర్శనం చేసుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వసిస్తారు. జ్వాలా తోరణ బస్మాని ధరిస్తే భూత,ప్రేత, పిశాచాలు అన్ని నశించిపోతాయని నమ్ముతారు.పురాణాలు ప్రకారం జ్వాలాతోరణం కార్యక్రమం చేయడానికి వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం ఉంది.యమలోకం వెళ్ళిన ప్రతి వ్యక్తికి ముందుగా దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ తోరణం మీద గానే వెళ్లాలి.
వాస్తవంగా యమలోకంలో పాపులకు వేసే మొదటి శిక్ష ఇది. ఆ శిక్ష లేకుండా పరమశివుని ప్రార్థించేందుకు కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే జ్వాలతోరణం కింద నుంచి మూడుసార్లు అటు ఇటు నడుస్తారో వారికి శివుడి కరుణా కటాక్షం లభిస్తాయని నమ్ముతారు.వారికి ఇక యమ ద్వారం చూడాల్సిన అవసరం రాదని అందుకే ఈ ఉత్సవంలో పాల్గొనాలని పెద్దలు ప్రతి ఒక్కరికి చెబుతారు. అంతటి విశిష్టత ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు.శివాలయాలు అన్ని కిటకిటలాడుతూ ఉంటాయి.
Also Read:వేశ్య వల్ల కాశీకి వెళ్ళలేదు.. ఆమె వక్షోజాలనే శివలింగంగా భావించి పూజించాడు..! చివరికి ఏమైంది?