కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన గానాలలో సుప్రభాతం ఒకటి. ప్రతి రోజు తిరుమలలో కూడా ఆయనకు సుప్రభాతాన్ని వినిపిస్తూనే సేవలను ప్రారంభిస్తారు. అయితే మీరెప్పుడైనా గమనించారా..? సుప్రభాతం ఎప్పుడూ శ్రీరాముని కీర్తనతో ప్రారంభం అవుతుంది.
“కౌసల్యా సుప్రజా.. రామా..” అంటూ ఈ సుప్రభాతం మొదలవుతుంది. మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా..? వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని శ్రీరాముని కీర్తనతో ఎందుకు ప్రారంభిస్తారు అని..?
అయితే ఈ ఆర్టికల్ చదివేయండి. అసలు ఈ సుప్రభాతాన్ని మొదటగా ఎవరు పాడారో తెలుసా..? ఈ సుప్రభాతాన్ని మొదట విశ్వామిత్రుల వారు పాడారు. శ్రీరాముడిని, లక్ష్మణుడిని తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళినప్పుడు శ్రీరాముడిని మేల్కొలపడానికి తొలుత విశ్వామిత్రుల వారు ఈ సుప్రభాతాన్ని ఆలపించారు. అలాగే ఈ గానంలోని రెండవ శ్లోకం “‘ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద’ ” అంటూ మొదలవుతుంది. ఇది శ్రీకృష్ణుడిని ఉద్దేశించినది.
అలా వరుసగా వచ్చే శ్లోకాలలో శ్రీ మహా విష్ణువు దశావతారాలను కీర్తించడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువనే అర్ధం. ఆయన పది అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం.. వంటి అవతారాలను కీర్తిస్తూ సుప్రభాతంలోని శ్లోకాలు ఉంటాయి. ఈ సుప్రభాతం వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఆయన దేవాలయాల్లో ఎక్కువగా దీనిని ఆలపిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో సుప్రభాతాన్ని ఆలపించిన వారిపై వేంకటేశ్వరస్వామి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి.