అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు మొలతాడు ఎందుకు ఉండకూడదు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు మొలతాడు ఎందుకు ఉండకూడదు..? దీని వెనుక ఇంత కారణం ఉందా..?

by Anudeep

Ads

జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.

Video Advertisement

పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత చేసే అంతక్రియలు లో పాటించే కొన్ని వీధులకి కూడా కారణం ఉంటుంది. అందులో ఒకటి అంత్యక్రియలు చేసేటప్పుడు మొలతాడు తీసేయడం.

అంత్యక్రియలు చేసేటప్పుడు మృతదేహానికి మొలతాడు కూడా ఉండకూడదట. ఏ మనిషి అయినా అమ్మ కడుపులోకి ఎలా వస్తాడో.. అలానే మరణించాక కూడా వెళ్ళిపోతాడట. మనిషి ఈ భూమిపైకి దిగంబరంగా వస్తాడు. అలానే వెళ్లిపోయేటప్పుడు కూడా అలానే వెళ్తాడు. బతికి ఉన్నంత కాలం మోసాలు, అక్రమాలు, బతుకు దెరువు కోసం తిప్పలు… అన్నీ పడి చివరకు ఏమి లేకుండానే పైకి వెళ్ళిపోతాడు. మరణించిన వారిని చూసి ఇది నేర్చుకోవాలి అని చెప్పడానికే ఇలా మృతదేహాన్ని ఇలా చేసి అంత్యక్రియలు నిర్వహిస్తారట.

final rituals 2

ఏ వ్యక్తి అయినా మరణించాక.. అతని భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు మాత్రమే వస్తాడని.. ఆ తరువాత ప్రయాణమంతా ఒంటరిగానే చేయాలనీ హిందూ ధర్మం చెబుతుంది. దేహం లోంచి జీవం పోయాక.. ఒంటిపై మొలతాడు కూడా మిగలదు.. అనవసరమైన వాటికోసం ప్రాకులాడవద్దు అని చెప్పడం కోసమే ఈ సంప్రదాయం పెట్టారట.


End of Article

You may also like