ఎవరీ చినజీయర్ స్వామీజీ..? ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి స్వామీజీగా ఎందుకు మారారు..?

ఎవరీ చినజీయర్ స్వామీజీ..? ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి స్వామీజీగా ఎందుకు మారారు..?

by Anudeep

Ads

చాలా మందికి చినజీయర్ స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. కానీ చిన జీయర్ స్వామీజీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఆయన టీవీలలో కూడా పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ.. ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు.

Video Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలలోను చినజీయర్ స్వామీజీ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

chinajeeyar swamiji

ఇందులో భాగంగానే భారీ సమతా మూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఇందుకోసం ప్రధాని మోడీ కూడా విచ్చేసారు. దీనితో ఈ అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంలో చినజీయర్ స్వామివారు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ప్రజలందరి దృష్టి ఈ విగ్రహం పైనే ఉంది. దీనితో.. చినజీయర్ స్వామీజీ ఎవరు..? ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది..? అంటూ ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.

chinajeeyar swamiji

చినజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1956 సంవత్సరం నవంబర్ 3 తేదీన, దీపావళి రోజున ఆయన జన్మించారు. అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల వారు చినజీయర్ స్వామి వారి తల్లి తండ్రులు. చినజీయర్ స్వామివారికి తల్లితండ్రులు మొదటగా పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. ఆయన గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు, వేద గ్రంధాలపైన శిక్షణ పొందారు. అలాగే నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద సంస్కృతాన్ని, తర్క శాస్త్రాన్ని అభ్యసించారు.

chinajeeyar swamiji

అలాగే రాజమండ్రిలోనే ఓరియంటల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. అయితే.. ఆ సమయంలోనే ఆయన తండ్రిగారు స్వర్గస్తులయ్యారు. దీనితో.. ఆయనపై కుటుంబ పోషణ భారం పడింది. దీనితో ఆయన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. ఉద్యోగం కోసం ఒక్క చేతి సంచితో హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదట్లో ఎన్నో చేదు అనుభవాల తరువాత ఒక చిన్న ఉద్యోగం లభించింది. ఇక్కడే టైపు, షార్ట్ హ్యాండ్ ను కూడా నేర్చుకున్నారు. తరువాత ఆ ఉద్యోగంలో మరో పైమెట్టు ఎక్కారు.

chinajeeyar swamiji

ఆ సమయంలో అనగా 1975 నాటికి ఓ సారి పెద్ద జీయర్ స్వామిజీ కాకినాడకు విచ్చేసారు. ఓ యజ్ఞం నిమిత్తం ఆయన విచ్చేసారు. యజ్ఞ క్రతువు సాగిస్తుండగా.. అనుకోకుండా.. పెద్ద జీయర్ స్వామిజీ తో శ్రీమన్నారాయణాచార్యులకు (ప్రస్తుతం చిన జీయర్ స్వామిజీ) పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని పెద్ద జీయర్ స్వామిజీ కోరడంతో.. ఆ పని తానే చేస్తానని, అప్పటికే తానూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చినజీయర్ స్వామిజీ పేర్కొన్నారు.

chinajeeyar swamiji

అలా ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకున్న శ్రీమన్నారాయణాచార్యులు పెద్ద జీయర్ స్వామీజీ వెంటే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనుమతితోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన గీతాజ్యోతి ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీత కు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు సమాజంలో బద్ధకాన్ని తొలగించి.. ప్రజల మధ్య సౌభాతృత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే.. చినజీయర్ స్వామిజీ వారు ఇక్కడితో ఆగలేదు.

chinajeeyar swamiji

అంధుల కోసం కాలేజీలు కట్టించారు. వారికి కళ్ళు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేసారు. అంధులకు శిక్షణ ఇవ్వడం కోసం నిపుణులను కూడా నియమించారు. అంతే కాదు.. సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికి అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసారు. అంతే కాదు, ఆయన 12 నెలల్లో 12 భాషలను నేర్చుకున్నారు. శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి వైద్యరంగాన్ని కూడా అనుగ్రహించారు. పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి, నేడు ప్రపంచానికే సమతామూర్తిని అందించిన ఘనత చినజీయర్ స్వామీజీకే దక్కుతుంది.


End of Article

You may also like