తిరుమలకి ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాకుండా భారత దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. తిరుమలని సందర్శించిన తర్వాత చాలా మంది భక్తులు చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలకి కూడా వెళ్తారు. శ్రీనివాస మంగాపురం, గోవిందరాజ స్వామి గుడి, అలివేలు మంగాపురం, పాపనాశనం, తర్వాత కాణిపాకం, తర్వాత శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు.

అయితే, శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే గుడికి వెళ్ళకూడదు అని అంటారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే. పంచభూతాలకి ప్రతీకగా పంచభూత లింగాలు వెలిశాయి. శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో వెలసిన వాయులింగం అందులో ఒకటి. అందుకే ఇక్కడి గాలి స్పర్శించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడదనేదే ఈ ఆచారం. శ్రీకాళహస్తి సందర్శించుకున్న తరువాత రాహు కేతువుల దోషం ఉంటే తొలగుతుంది.

శ్రీకాళహస్తి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సందర్శించుకుంటే, సర్ప దోషం తొలగుతుంది. దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలని వదిలేసి వెళ్ళాలి. తర్వాత వేరే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా దోషనివారణ జరగదు అని చెప్తారు. అందుకే ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాలి అని అంటారు. ఒక్క పరమశివుడిపై తప్ప మిగిలిన అందరి దేవుళ్ళపై శని ప్రభావం, గ్రహ ప్రభావం ఉంటుంది.

చంద్ర గ్రహణం సమయంలో అన్ని దేవాలయాలని మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ చేసి తర్వాత పూజలు ప్రారంభిస్తారు. కానీ శ్రీకాళహస్తిలో మాత్రం గ్రహణ సమయంలో కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అంతే కాకుండా రోజంతా ప్రత్యేక పూజలు జరుగుతాయి. అందుకే శ్రీకాళహస్తి దర్శించిన తర్వాత వేరే దేవాలయాన్ని దర్శించకూడదు అని చెప్తారు.

స్త్రీలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి, శ్మశాన వాటికకు వెళ్ళకుండా నిషేధించడం చాలామంది పురాణాల ఆధారంగా అధ్యయనం చేశారు. మహాభారత కాలంలో స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనేవారని తెలుస్తోంది. భీష్ముడి దహన సంస్కారాల సమయంలో కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొన్నట్లు కనుగొన్నారు. పూర్వ కాలంలో మరణానికి, స్వర్గానికి కుమారుడు వారధి అని భావించేవారు. మరణించినవారికి అంత్యక్రియలు మరియు చితికి నిప్పు పెట్టడం వంటి ప్రక్రియ కుమారుడు చేస్తే ఆ వ్యక్తులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసించేవారు.
అందువల్ల కుమారుడు లేదంటే కుమారుడితో సమానమైనవారితో దహన సంస్కారాలు చేయించేవారు. పూర్వ కాలంలో స్త్రీలు చాలా సున్నితమైన వారు అని, త్వరగా భావోద్వేగానికి లోనవుతారని అనుకునేవాళ్ళు. అందువల్ల దహన సంస్కారాలను స్త్రీలు చూసి తట్టుకోలేరని, వాళ్లను అంత్యక్రియలకు దూరంగా ఉంచేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలను స్మశాన వాటికకి రాకూడదు అనడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే,
పూర్వకాలంలో అంత్యక్రియలు చేసేటపుడు, ఇంట్లో ఉండే వృద్దులను, పిల్లలను చూడడం కోసం. వచ్చినవారందరికి భోజన ఏర్పాట్లు చేయడం కోసం స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. పురుషులు మాత్రమే స్మశానంకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఇక అంత్యక్రియలు చేసేటపుడు స్మశానంలో దుష్టశక్తులు కూడా ఉంటాయట. స్త్రీలు సున్నితంగా ఉండడం వల్ల వాళ్లను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉందని, మహిళలను స్మశాన వాటికలోకి నిషేధించారట. దహన సంస్కారాలకు వెళ్ళిన స్త్రీలు తమ వెంట్రుకలను తీసివేయాలట. ఆ కారణంగా కూడా స్త్రీలను నిషేధించారని తెలుస్తోంది.


































