చాలా మందికి పద్ధతులు తెలియక ఇష్టం వచ్చినట్లు అనుసరిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయకుండా శాస్త్రం ప్రకారం అనుసరించడం మంచిది. ఈరోజు అభిషేకం చేయడం లో దాగి ఉన్న అంతరార్థం గురించి తెలుసుకుందాం.
ఒకవేళ కనుక మీరు అభిషేకాలు కి సంబంధించి ఎటువంటి తప్పులు చేస్తూ ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోండి. అయితే మన జీవితంలోకి వచ్చినది ప్రతీ ఒక్కటి కూడా పోతు ఉంటుంది.
శివ లింగానికి అభిషేకం చేసినప్పుడు కూడా నీళ్ళు జారి పోతూ ఉంటాయి. అంతే కానీ శివలింగం మీద అవి ఉండవు. అందుకనే కేవలం దానికి మాత్రమే అభిషేకం చేయాలి. విగ్రహాలకి అభిషేకం చేయకూడదు. విగ్రహానికి కేవలం పూలతో పూజ చేయాలి.
అంతే కానీ లింగానికి చేసినట్లు అభిషేకం చేయకూడదు. మన దగ్గర పదార్థాలు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు అభిషేకం చేయకూడదు. జీవితంలో వచ్చిన ప్రతీది కూడా పోతుంది. ఏది స్థిరంగా ఉండదు. వచ్చిన ప్రతీది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.
కాబట్టి అభిషేకం చేసినప్పుడు కూడా వేసి ప్రతిదీ కూడా కిందకి జారి పోవాలి. అందుకనే శివుడికి అభిషేకం చేసినప్పుడు నీళ్లతో మాత్రమే అభిషేకం చేయాలి. అది కూడా లింగానికి మాత్రమే. కాబట్టి ఎప్పుడైనా మీరు అభిషేకం చేసారు అంటే తప్పని సరిగా వీటిని మీరు గుర్తుంచుకోండి.