లాఫింగ్ బుద్ధాని బహుమతిగా ఇవ్వడం వెనుక కారణం ఏమిటో మీకు తెలుసా..?

లాఫింగ్ బుద్ధాని బహుమతిగా ఇవ్వడం వెనుక కారణం ఏమిటో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

చాలా మంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాని పెడుతూ ఉంటారు. లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడం చాలా శుభకరంగా భావిస్తారు. అలాగే లాఫింగ్ బుద్ధ శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకు వస్తుందని కూడా అందరు నమ్ముతూ ఉంటారు. పైగా లాఫింగ్ బుద్దని బహుమతిగా ఇవ్వడం చాలా మంచిదని కూడా అంటారు.

Video Advertisement

చైనాలో అయితే లాఫింగ్ బుద్ధాని దేవుడి కింద భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. అయితే లాఫింగ్ బుద్ధా గురించి చాలా మందికి తెలుసు కానీ లాఫింగ్ బుద్ధా కథ గురించి తెలియదు. ఈరోజు ఆ కథ ఏంటో చూద్దాం.

చైనాలో హనోయి అనే ఒక బుద్ధుడి అనుచరుడు ఉండేవాడు. అయితే అతను కాలక్షేపం చేయడం.. అందరినీ నవ్వించడం.. జోకులు చెప్పడం లాంటివి చేస్తూ ఉండేవాడు. అయితే అతను ఎక్కడికి భిక్షాటనకి వెళ్ళినా సరే అందరూ అతన్ని చూసి ఎగతాళి చేసేవారు. ఎందుకంటే అతను చాలా లావుగా ఉండే వాడు. అతని బొడ్డు మరియు బలమైన శరీరం చూడడానికి కాస్త హాస్యంగా ఉండేది.

పైగా అతను అందర్నీ నవ్వించే వాడు. ఆనందాన్ని కూడా పంచుకునే వాడు. నిజానికి ఇదే అతని జీవిత లక్ష్యం. ఇలా లాఫింగ్ బుద్ధ విగ్రహానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ఇండియాలో కూడా లాఫింగ్ బుద్ధాను ఇంట్లో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని.. డబ్బు కూడా ఉంటుందని అంటారు.

అలాగే ఒకరికి గిఫ్ట్ కింద లాఫింగ్ బుద్ధాని ఇస్తే వాళ్ళు స్వార్ధపరులుకారని అంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ లాఫింగ్ బుద్ధాని పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తద్వారా ఐశ్వర్యం కలుగుతుంది. లాఫింగ్ బుద్ధాని పెట్టేటప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో పెడితే మంచిది. అలానే ముఖద్వారం ముందు ఉంటే మరీ మంచిది.


End of Article

You may also like