మేడారం జాతర ఎప్పుడు మొదలైంది.. దీని వెనుక ఉన్న ఈ అసలు కథ ఏంటో తెలుసా..?

మేడారం జాతర ఎప్పుడు మొదలైంది.. దీని వెనుక ఉన్న ఈ అసలు కథ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో సమ్మక్క-సారక్క జాతర గురించి తెలియని వారుండరు. ఎంతో భక్తి శ్రద్దలతో సమ్మక్క-సారక్కలను కొలుస్తుంటారు. దాదాపు మూడు రోజుల పాటు వేడుకగా జాతరను జరుపుకుంటారు. అయితే.. ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు..? ఎప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది అనే విషయాలు చాలా మందికి తెలియవు.

Video Advertisement

అసలు ఈ మేడారం జాతరను జరపడం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మేడారంకు చెందిన గిరిజన తెగ వారు గోదావరి నదీ తీరం వద్దనున్న అడవికి వేటకి వెళ్లారట.

medaram jathara 1

అక్కడ కొద్దీ దూరంలో వారికి ఒక చిన్న పాప ఆడుకుంటూ కనిపించిందట. అయితే, వారు ఆ పిల్లను తెచ్చుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆమెకు సమ్మక్క అని నామకరణం కూడా చేసారు. సమ్మక్క చిన్నతనం నుంచి చాలా మహిమలు ప్రదర్శించేది. తన శక్తీ యుక్తులతో, మహిమలతో ఆ ఊరి ప్రజలను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కాపాడేది.

medaram jathara 2

కొంతకాలానికి ఆమె వివాహం కాకతీయ సామంత రాజు అయిన పగిడిగద్ద తో జరిగింది. ఆ తరువాత వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. సారలమ్మ వివాహం గోవింద రాజుతో జరిగింది. కొన్నాళ్ల తరువాత ఆ ఊరిలో కరువు కాటకాలు వాటిల్లాయి. దీనితో సామంత రాజు అయిన పగిడిగద్ద కాకతీయులకు పన్ను చెల్లించలేకపోయారు. దీనితో ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది.

medaram jathara 3

ఈ యుద్ధంలో సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జంపన్న తన వారందరు చనిపోయే సరికి ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ సంగతి తెలియడంతో సమ్మక్క ఒక్కత్తే యుద్ధం చేస్తుంది.. యుద్ధ సమయంలో ఓ సైనికుడు వెన్నుపోటు పొడవడంతో రక్తం కారడం మొదలైంది. అలానే ఆమె చిలకల గుట్ట వైపు వెళ్ళింది. అటుగా వెళ్లిన సారక్క ఓ మలుపు వద్ద మాయమైంది. అయితే ఆమె కోసం కోయగూడెం వాసులు తీవ్రంగా గాలించారు.

medaram jathara 4

చివరకు గుట్ట వద్ద ఉండే నెమలి నార వద్ద ఓ కుంకుమ భరిణె కనిపించిందట. ఆ సమయంలో “ఈ గడ్డ మీద పుట్టే వ్యక్తి వీరుడిగానే పుట్టాలి..  ఆ ప్రదేశంలో రెండు గద్దలను నిర్మించి రెండేళ్లకు ఒకసారి ఉత్సవాలు జరిపిస్తే భక్తుల కోరికలు తీరతాయి..” అని ఆకాశ వాణి వినిపించింది. దీనితో అది సారక్కే అని కోయగూడెం వాసులంతా నమ్మారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకేసారి సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహిస్తున్నారు.


End of Article

You may also like