గుడిలో అమ్మవార్లకు నిమ్మకాయ దండలు ఎందుకు వేస్తారు..? దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటే..?

గుడిలో అమ్మవార్లకు నిమ్మకాయ దండలు ఎందుకు వేస్తారు..? దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటే..?

by Megha Varna

Ads

అమ్మవారిని ఈ ఆలయంలో చూసిన ఎంతో అందంగా అలంకరిస్తారు. మంచి చీర కట్టి ముస్తాబు చేస్తూ ఉంటారు. అలానే ఆభరణాలను వేసి అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరించడం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు దేవికి పసుపు, కుంకుమలని సమర్పిస్తారు.

Video Advertisement

అలానే వస్త్రాలను ఇస్తూ వుంటారు. గ్రామాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా అమ్మ వారికి నిమ్మకాయల దండలను కూడా వేస్తూ ఉంటారు. అయితే నిజానికి చాలా మందికి ఈ సందేహం ఉంటుంది.

అమ్మ వారికి నిమ్మకాయల దండలు ఎందుకు వెయ్యాలి అని… కానీ లక్ష్మీ దేవికి కానీ సరస్వతి దేవికి కానీ చూసుకున్నట్టయితే నిమ్మకాయ దండలు వెయ్యరు. గ్రామాల్లో వుండే అమ్మవార్లకు ఎక్కువగా నిమ్మకాయలని దండలుగా గుచ్చి వేస్తారు. అయితే ఎందుకు నిమ్మకాయల దండలను అమ్మ వారికి వేయాలి అనేది చూస్తే…

అమ్మ వారు రక్షణ బాధ్యత కలిగి వుంటారు. ఎప్పుడూ కూడా శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తుంటుంది నిర్వహిస్తూ ఉంటుంది. లయకారుని శక్తి ఏ అమ్మవారు. అమ్మవారికి తామస గుణం ఉంటుంది. అయితే దేవి సంహార క్రియ నిర్వహించేప్పుడు తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తుంది. పైగా ఆ గ్రామానికి రక్షణగా గ్రామమంతా సంచరిస్తూ కాపలా కాస్తూ ఉంటుంది.

అలాంటి వీరత్వాన్ని ప్రతిబింబించడానికి ఈ నిమ్మకాయల దండలు వేస్తారు. అలాగే అమ్మ వారికి మాములుగా బలి ఇస్తూ ఉంటారు. ఆ బలిగా మనము శిరస్సుని ఇవ్వాలి. శిరస్సుకి ప్రతీక గుమ్మడి కాయ. ఈ మూలంగానే అమ్మ వారికి గుమ్మడికాయను కూడా ఇస్తూ ఉంటారు. ఈ కారణాల వల్లనే అమ్మ వారికి నిమ్మకాయల దండలు వేయడం.. గుమ్మడికాయను సమర్పించడం జరుగుతోంది. తరతరాల నుండి కూడా పూర్వికులు ఈ పద్దతిని పాటిస్తున్నారు. మనం కూడా ఇంకా అనుసరిస్తూనే వున్నాం.


End of Article

You may also like