కలకత్తాలో కొందరు బ్రాహ్మణులు చేపలను ఎందుకు తింటారో తెలుసా.? అది మాంసాహారం కదా..?

కలకత్తాలో కొందరు బ్రాహ్మణులు చేపలను ఎందుకు తింటారో తెలుసా.? అది మాంసాహారం కదా..?

by Anudeep

Ads

సాధారణంగా బ్రాహ్మణులు అనగానే ముందు గుర్తు వచ్చేది వారు మాంసాహారం తినరని, కేవలం సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భుజిస్తారని అనుకుంటూ ఉంటాం. చాలా వరకు దక్షిణ భారత దేశంలో ఉండే బ్రాహ్మణులు అందరు ఇలానే ఉంటారు. వారు మాంసాహారాన్ని ముట్టరు.

Video Advertisement

కానీ, బెంగాల్ వైపు మాత్రం అక్కడి బ్రాహ్మణులు చేపలను జలపుష్పాలుగా భావించి భుజిస్తారు. వారి ఆహరం లో చేపలు సర్వ సాధారణంగా ఉంటాయి.

అయితే.. అక్కడి బ్రాహ్మణుల్లో ఇంత వింత అలవాటుకి కారణం ఏంటంటే.. అక్కడ ఏర్పడిన రెండు దారుణ కరువులే. 1770, 1945 సంవత్సరాలలో అక్కడ విపరీతమైన కరువు ఏర్పడింది. చాలా కాలం పాటు ఉన్న ఆ కరువు వల్ల అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ఈ రెండు కరువులు భారత దేశ చరిత్రలో నిలిచిపోయాయి.

bengal brahmins 2

ఈ రెండు కరువు వల్ల కోట్ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ పరిస్థితిలో ప్రాణాలు నిలుపుకోవడం కోసం అక్కడి బ్రాహ్మణులు అక్కడి నదుల్లో విరివిగా లభించే చేపలను తీసుకోవడం మొదలు పెట్టారు. మరొక కారణం ఏంటంటే.. బెంగాల్ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ ప్రోటీన్ ను అందించే కందిపప్పు వంటి పంటలు ఏమీ పండవు.

bengal brahmins 3

ఈ పంటలు పండించడం కష్టతరం కాబట్టి.. వారు ప్రోటీన్ ఫుడ్ కోసం చేపలపై ఆధారపడడం ప్రారంభించారు. బెంగాల్ గంగా నది డెల్టా,ఇంకా అనేక ఉపనదులు లో ఈ జల పుష్పాలు విరివిగా దొరుకుతాయి.అందుకే కుల, మత తేడాలు లేకుండా బెంగాల్ వాసులు చేపలను తమ ఆహారంలో భాగం చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే.. కాశ్మీరీ బ్రాహ్మణులు కూడా మాంసాహారులు. కానీ, వీరు అల్లం, వెల్లుల్లిని మాత్రం ముట్టరు. వీరు మాంసం తీసుకోవడానికి కారణం ఏంటంటే.. కాశ్మిర్ లో కూరగాయలు పండకపోవడమే. ప్రాంతంలో దొరికే ఆహార పదార్ధాలని బట్టే మనుషుల యొక్క ఆహార అలవాట్లు ఏర్పడుతూ ఉంటాయి.


End of Article

You may also like