భార్య భర్తలు ఎంత అన్యోన్యం గా ఉండాలో అంత గౌరవ మర్యాదలను కూడా ఇచ్చిపుచ్చుకోవాలి. ఇతరుల ముందు ఒకరినొకరు కించపరుచుకోకూడదు. అలాగే, మన హిందూ సంప్రదాయాలలో ఎక్కడ భర్తను భార్యలు పేరు పెట్టి పిలవాలని చెప్పలేదు. భర్తను గౌరవించాలని మాత్రం చెప్పింది.
పాశ్చాత్య దేశాలలో ఈ సంప్రదాయం ఉండదు. వారు భర్తలను, కొంతమంది ఐతే తల్లి తండ్రుల్ని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తూ ఉంటారు. ఇదే కల్చర్ క్రమం గా మన దేశం లో కూడా విస్తరిస్తోంది. సాధారణం గా మనం మనకంటే వయసులో పెద్ద వారిని పేరు పెట్టి పిలవము. బంధుత్వం తో పిలుస్తాము. మీరు అంటూ మర్యాదగా మాట్లాడతాము. అదే, జీవితాంతం మనకు రక్షణ ఇస్తానంటూ అగ్ని సాక్షి గా ప్రమాణం చేసిన వ్యక్తి గా పేరు పెట్టి పిలవడం భావ్యం కాదని శాస్త్రం చెబుతోంది.
భార్య భర్తలు ఏకాంతం గా ఉన్న సమయం ఎలా పిలుచుకున్నా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, నలుగురి ముందు భర్తను పేరు పెట్టి పిలవడం వలన భర్త మర్యాదను తగ్గించినట్లే కాకుండా.. భార్యలు కూడా గౌరవాన్ని కోల్పోతారు. అలాగే, పిల్లల ముందు, భర్త తల్లి తండ్రుల ముందు కూడా భర్తను అగౌరవపరుస్తూ పిలవడం సరికాదు. ఒకవేళ మీకు పేరు పెట్టి పిలవడమే ఇష్టమైతే.. మీ భర్తతో చర్చించి అతనికి ఇష్టం ఉందొ లేదో కూడా తెలుసుకోవడం ముఖ్యమే. చాలా మంది తల్లి తండ్రులకు కూడా తమ కొడుకుని భార్య అలా పేరుతో పిలిస్తే నచ్చదు. కాబట్టి ఇలా చేసే ముందు అన్ని ఆలోచించుకోవడం మంచిది.