చాణక్యుడిని ప్రేమించిన ఆ అమ్మాయి వేశ్యగా మారిందట.? కారణం అదే అంట.?

చాణక్యుడిని ప్రేమించిన ఆ అమ్మాయి వేశ్యగా మారిందట.? కారణం అదే అంట.?

by Mohana Priya

Ads

sourced from: a youtube channel “vikram aditya

Video Advertisement

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.

ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. విక్రమ్ ఆదిత్య యూట్యూబ్ ఛానల్ కథనం ప్రకారం చాణుక్యుడికి కూడా ఒక ప్రేమ కథ ఉంది అని చరిత్ర చెబుతోంది. చాణుక్యుడు సుహాసిని అనే అమ్మాయిని ఇష్టపడ్డాడు.

చాణుక్యుడు తన తల్లి బ్రతికి ఉన్నారని తెలిసి మగధకి వెళతాడు. అక్కడ తన తల్లి లేకపోయేటప్పటికి, ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి తన బాబాయి అయిన కాత్యాయనుడి దగ్గరికి వెళ్తాడు. కాత్యాయనుడితో చాణుక్యుడు, తన తల్లి బ్రతికి ఉన్నారనే విషయం ఎందుకు దాచిపెట్టారని అడుగుతాడు. అందుకు కాత్యాయనుడు, “నేను కూడా మీ నాన్న చనిపోయిన రోజు, ధనానందుడు తన బంట్ల చేత మీ తల్లిని కూడా చంపించాడు అని అనుకున్నాను. కానీ ఆమె కొన ఊపిరితో ఉండడం చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆమెకి వైద్యం చేసి బ్రతికించారు. నాకు ఈ విషయం 4 సంవత్సరాల తర్వాత తెలిసింది. నేను మీ అమ్మతో తాను బ్రతికి ఉంది అనే విషయం నీకు తెలిస్తే నువ్వు సంతోషిస్తావు అని చెప్పాను. ”

Chanakya about problem solving skills

“అందుకు మీ తల్లి, “ఆ ధనానందుడు నా భర్తని చంపేశాడు. ఇప్పుడు నాకు మిగిలింది నా కొడుకు మాత్రమే. తనని అక్కడే ప్రశాంతంగా విద్యని అభ్యసించనివ్వండి. నేను బతికి ఉన్నాను అని తెలిస్తే నా కొడుకు చదువు ఆపి ఇక్కడికి వస్తాడు. ధనానందుడి వల్ల నా కొడుకు ప్రాణాలకి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నేను బ్రతికి ఉన్న విషయం నా కొడుకుకి తెలియనివ్వొద్దు” అని మీ అమ్మ నా దగ్గర మాట తీసుకున్నారు” అని చెప్తారు. “ఇప్పుడు నేను నా తల్లిని చూడాలి” అని చాణుక్యుడు తన బాబాయిని అడుగుతాడు. అందుకు కాత్యాయనుడు, “ఆమె 6 నెలల క్రితం అనారోగ్యం కారణంగా చనిపోయారు” అని చెప్తారు.

అందుకు ఎంతో బాధపడిన చాణుక్యుడు కొద్ది సేపటికి తేరుకొని ప్రధానమంత్రి షక్తర్ గురించి అడుగుతాడు. అందుకు కాత్యాయనుడు, “నువ్వు ఇక్కడనుండి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. షక్తర్ ని నందుల నరకంలో పడేసిన తర్వాత రాక్షసుడు ప్రధానమంత్రి అయ్యాడు. ధనానందుడికి మద్యాన్ని, మగువలని ఇంకా ఎక్కువగా అలవాటు చేశాడు. అలా రాజ్యం మొత్తాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. పేరుకి ధనానందుడిని రాజు అని అన్నా కూడా, రాజ్య పాలన మాత్రం రాక్షసుడు చూసుకుంటున్నాడు” అని చెప్తారు.

chanakya suhasini story

చాణక్యుడు, సుహాసిని గురించి అడగడంతో కాత్యాయనుడు ఈ విధంగా చెప్తారు, “రాక్షసుడు షక్తర్ ని చంపకుండా ఉండాలంటే సుహాసిని తనకి కావాలి అని అడిగాడు. తన తండ్రిని బతికించుకోవడానికి సుహాసిని రాక్షసుడికి వేశ్యగా మారింది. అతనికి కావలసినప్పుడు సుహాసిని అతని దగ్గరికి వెళ్లాల్సిందే. లేదంటే అదే రోజు రాక్షసుడు షక్తర్ ని చంపేస్తాడు” అని చెప్తారు. అది విన్న చాణుక్యుడు కోపంతో రగిలిపోతాడు.


End of Article

You may also like