చాణక్య నీతి: వీళ్ళతో జాగ్రత్త… ఈ వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ఇబ్బందులు తప్పవు…!

చాణక్య నీతి: వీళ్ళతో జాగ్రత్త… ఈ వ్యక్తులు మీ చుట్టూ ఉంటే ఇబ్బందులు తప్పవు…!

by Megha Varna

Ads

కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్నది సాధించలేము. మన పనికి ఆటంకం రావడం లేదు అంటే మధ్యలోనే ఆగిపోవడం ఇలాంటివి చాలా సార్లు మనకి జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరగకుండా మనం అనుకున్నది సాధించాలన్నా, తప్పక గెలుపు పొందాలన్నా మనం చేసే ప్రయత్నం, పడే కష్టం తో పాటు మన చుట్టూ ఉండే మనుషులు కూడా చాలా ముఖ్యం అని చాణక్యనీతి చెబుతోంది.

Video Advertisement

మానవ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలని ఆచార్య చాణక్య చాణక్య నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు. అయితే కొంతమంది మనుషులు కారణంగా మనం అనుకున్నది చేయకుండా ఓడిపోతూ ఉంటామని చాణిక్య నీతి చెబుతోంది. అందరి మనస్తత్వాలు ఒకలాగ ఉండవు.

ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు. అందుకని అందరినీ అనవసరంగా నమ్మి మోసపోవద్దు. ఈ మూడు వ్యక్తులు చాలా ప్రమాదకరమని… ఈ మనస్తత్వాలు కలిగిన వాళ్లకు దూరంగా ఉంటేనే మంచిదని చాణక్యనీతి అంటోంది. అయితే మరి మనం విజయం పొందాలంటే ఎటువంటి మనస్తత్వం ఉండే మనుషులు ఉండకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

#1. కోపం:

కోపం ఉన్న వాళ్ళని చేరదీస్తే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కోపంతో ఉన్న వారు మనకు ఎప్పటికైనా ప్రమాదకరమే. కోపంతో ఉన్న వాళ్లు నిజంగా ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. దీని వల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.

#2. స్వార్థం:

స్వార్థంతో ఉన్నవాళ్లు సొంత లాభం కోసమే ఆలోచిస్తారు తప్ప ఇతరుల గురించి ఆలోచించరు. ఎప్పుడూ కూడా స్వార్ధంతో ఉన్నవాళ్ళని నమ్మకూడదు అని చాణక్య నీతి అంటోంది.

#3. పొగడ్తలు:

చాలా మంది వ్యక్తులు పొగుడుతూ ఉంటారు. అయితే పొగిడే వాళ్లని మనం దరిచేరనివ్వకూడదు. నిజానికి వీళ్ళు వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి ఇటువంటి వాళ్లకి దూరంగా ఉంటేనే మంచిది. అప్పుడే మనం విజయం సాధిస్తాం.


End of Article

You may also like