పూజకు ఈ పూలను ఉపయోగిస్తున్నారా.? అయితే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.!

పూజకు ఈ పూలను ఉపయోగిస్తున్నారా.? అయితే పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.!

by Megha Varna

Ads

ప్రపంచంలోనే పారిజాత చెట్టుకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది చాలా పురాతనమైన చెట్టు. ఈ చెట్టుకు సంబంధించి అనేక కథలు కూడా ఉన్నాయి. సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని దివి నుండి భువికి శ్రీకృష్ణుడు తీసుకువచ్చారు. అదేవిధంగా ఇంద్రుడు స్వర్గంనుండి దీన్ని తీసుకువచ్చారని కూడా చాలామంది నమ్ముతారు.

Video Advertisement

మరొక పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే మహాభారతంలో పాండవులు తన తల్లితో కలిసి అడవిలో నివసించే సమయంలో శివుడిని పూజించడానికి పూలు లేక అర్జునుడు దేవేంద్రుడిని ఆరాధించి అతనికి పారిజాత చెట్టు ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఇంద్రుడు పారిజాత చెట్టు ఇస్తాడు. ఈ వృక్షానికి పూసిన పువ్వులు చాలా అందంగా బంగారు రంగు తెలుపు రంగుతో చాలా అద్భుతంగా ఉంటాయి.

పాలపుంత నుండి వచ్చిన అనేక వాటిలో పారిజాత వృక్షం కూడా ఒకటి. ప్రజలు పారిజాత వృక్షాన్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఇంత పవిత్రమైన ఆ పూలని ఎవరు ఇచ్చినా కూడా తీసుకోకూడదు. పారిజాత పూలు నేల మీద పడతాయి. వాటిని తీసి పూజ చేయాలి. అయితే సాధారణంగా ఏ పూలు కూడా కిందపడితే పనికిరావు. కానీ పారిజాత వృక్షానికి అలా కాదు.

కిందపడిన పూలను మాత్రమే దేవుడికి పెట్టాలి. అందుకనే ఈ వృక్షం కింద ఎప్పుడూ ఆవుపేడతో అలికి శుభ్రంగా ఉంచుకుంటారు. ఆ తర్వాత వాటిని తీసి దేవతలకు పెడతారు. అయితే ఎవరిని అడిగి కానీ ఎవరి దగ్గర తీసుకుని కానీ పారిజాత వృక్షం పూలని పెట్టకూడదు. వాటిని పెడితే ఎలాంటి ఫలితం దక్కదు.


End of Article

You may also like