గురుదక్షిణగా ద్రోణుడికి బొటన వేలు కోసిచ్చిన తర్వాత… ఏకలవ్యుడు ఏమయ్యాడు..?

గురుదక్షిణగా ద్రోణుడికి బొటన వేలు కోసిచ్చిన తర్వాత… ఏకలవ్యుడు ఏమయ్యాడు..?

by Mohana Priya

Ads

ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించిన సంగతి తెలిసిందే. ఏకలవ్యుడి ప్రతిభ గురించి తెలుసుకున్న ద్రోణుడు ఏకలవ్యుడిని కలిసి గురుదక్షిణ అడుగుతాడు.

Video Advertisement

ఆ తర్వాత ద్రోణుడు కోరడంతో ఏకలవ్యుడు బొటన వేలును గురుదక్షిణగా ఇస్తాడు. విలువిద్యలో బొటన వేలు కీలక పాత్ర పోషిస్తుంది. బొటన వేలు లేకపోవడం వల్ల ఏకలవ్యుడు విలువిద్యలో దూరం అవుతాడు అనే ఉద్దేశంతో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలు ఇవ్వమని అడిగాడు అని మనం అనుకుంటాం. కానీ కారణం వేరే ఉంది. అసలు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని బొటనవేలు ఇవ్వమని ఎందుకు అడుగుతాడో ఇప్పుడు చూద్దాం.

what happened to ekalavya after cutting his thumb

కాలక్రమేణా ఏకలవ్యుడు అధర్మాలకు పాల్పడి, ఊహించని అనర్థాలకు కారణం అవుతాడు అని ద్రోణాచార్యుడు ముందే ఊహించాడు. దాంతో లోకకళ్యాణం కోసం బొటన వేలు ఇవ్వమని అడుగుతాడు. కానీ ద్రోణాచార్యుడు ఊహించినట్టుగా ఏమీ జరగలేదు. ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్ళతో విలు విద్యను కొనసాగించాడు. కానీ అధర్మం వైపు నిలబడ్డాడు. ఏకలవ్యుడి సహాయంతో జరాసంధుడు కృష్ణుడి మీదకి సేనలను పంపేవాడు.

what happened to ekalavya after cutting his thumb

ఏకలవ్యుడు ముందుండి సేనలపై యుద్ధం చేసేవాడు. ఆ యుద్ధం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటంతో కృష్ణుడే యుద్ధభూమిలోకి దిగి ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు. విలువిద్యలో ఎంతో నైపుణ్యం సాధించిన ఏకలవ్యుడు ధర్మ అధర్మాలు ఆలోచించకుండా అధర్మం వైపు నిలబడ్డాడు. దాంతో ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఏకలవ్యుడు అధర్మం వైపు నిలబడడంతో ఆ ప్రతిభకి సరైన అర్థం లేకుండా పోయింది.


End of Article

You may also like