మన పెద్దలు ఏమి చెప్పినా దానికి వెనుక చాలా తర్కం ఉంటుంది. ఉప్పుని కూడా లక్ష్మి దేవి తో పోలుస్తూ ఉంటారు. అప్పు ఇవ్వకూడదని, చేతికి ఇవ్వకూడదని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి దేవి సముద్రం నుంచి పుట్టింది. ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది. అందుకే ఉప్పుని కూడా లక్ష్మి తో పోలుస్తారు. ఉప్పుని అప్పు గా ఇవ్వొద్దని, నేలపై పడితే తొక్కవద్దని చెబుతుంటారు.
ఉప్పు అంటే ఇక్కడ కల్లు ఉప్పు అని అర్ధం. చాలా మంది ఉప్పు ప్యాకెట్లు టెస్టు ఉంటారు. అవి కృత్రిమం గా తయారుచేయబడ్డవి. సముద్రం లో దొరికే ఉప్పు రాళ్ల ఉప్పు మాత్రమే. దీనికి హిందూ సంప్రదాయం లో చాలా విశిష్టత ఉంది. రాళ్ల ఉప్పు కరిగించిన నీటితో ఇల్లు తుడవడం వలన బాక్టీరియా దరిచేరదు. ఆ నీటితో కూరలు కడగడం వలన శుభ్రం గా ఉంటాయి. అలాగే.. ఈ రాళ్ల ఉప్పుని నీటిలో కరిగించి ఇంట్లో కలిసి వచ్చే చోట ఒక మూలగా పెట్టడం వలన ఆర్ధిక ఇబ్బందులు తీరతాయని చెబుతుంటారు. మరికొందరైతే ఎర్రటి గుడ్డలో రాళ్ళఉప్పు వేసి ఇంటికి గుమ్మానికి కడతారు. తర్వాత ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని చోట పడవేస్తారు. ఇలా చేయడం వలన ఆ ఇంటికి దిష్టి తగలదు అని చెబుతుంటారు.