Deeparadhana: పొరపాటున దీపారాధన కొండెక్కితే ఏమవుతుంది..? అపశకునమా?

Deeparadhana: పొరపాటున దీపారాధన కొండెక్కితే ఏమవుతుంది..? అపశకునమా?

by Anudeep

Ads

మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగించడం తప్పనిసరి. దీపం వెలుగుని ప్రసాదించి జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి రోజు దీపం వెలిగించాలని చెబుతుంటారు. కొందరు ఉదయం వెలిగిస్తే.. కొందరు సాయంత్రం కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే.. కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా దీపం కొండెక్కుతూ ఉంటుంది.

Video Advertisement

deeparadhana

దీపం జ్ఞానప్రదాయిని. కాబట్టే.. ఇది కొండెక్కడం అపశకునమని చెబుతుంటారు. అలాగే ఆరిపోయింది అని కూడా చెప్పకూడదు అంటూ పెద్దలు అంటుంటారు. దీపం అంత పవిత్రమైనది కాబట్టే ఇన్ని నిబంధనలు వచ్చాయి. అయితే.. పొరపాటున దీపం కొండెక్కడం వలన ఎలాంటి దోషము ఉండదు. ఆ వత్తులను మళ్ళీ సరిచేసుకుని లేదా కొత్త వత్తులను వేసుకుని తిరిగి దీపం వెలిగించవచ్చు. గాలిలో దీపం పెట్టి వదిలేసి కొండెక్కింది అని బాధపడకూడదు. ఆ దీపాన్ని పరిరక్షించాలి. పొరపాటున కొండెక్కడం వలన దోషం ఉండదు. అదేమీ అపశకునం కాదు.


End of Article

You may also like