ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం గడపాలి అనుకున్నారు. కానీ అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం, నిజామాబాద్ లో శ్రవణ్, మౌనిక అనే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారిద్దరి కులాలు వేరు. దాంతో ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. అయినా కూడా ఈ జంట భయపడలేదు. విడిపోకుండా ఇద్దరూ కలిసి పెద్దలను ఎదిరించి గత సంవత్సరం జూన్ 3వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
తర్వాత హైదరాబాద్ లో కాపురం పెట్టారు. పెళ్లయిన తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. శ్రవణ్ తన తల్లిదండ్రుల మాట విని, కట్నం కోసం మౌనికని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ హైదరాబాద్ లో పోలీసులకు మౌనిక ఫిర్యాదు చేశారు. శ్రవణ్ తల్లిదండ్రులు, మౌనికతో, “నీకు భరణం ఇస్తాము. మా అబ్బాయికి విడాకులు ఇచ్చేసేయ్” అని చెప్పారు. దాంతో “నా భర్త నాకు కావాలి. నేను విడాకులు ఇవ్వను” అని మౌనిక అత్తవారింటి ఎదుట ఆందోళనకు దిగారు.
ఈ విషయంపై మౌనిక మాట్లాడుతూ, “మా అత్తగారు, నా భర్త యొక్క అన్న రవికాంత్, అతని భార్య ఆమని నాపై దాడి చేశారు. నా భర్త నాకు కావాలి. నేను విడాకులు ఇవ్వను. నాకు న్యాయం కావాలి” అని పోలీసులను ఆశ్రయించారు. కోటి రూపాయల కట్నం తీసుకురమ్మని తనను వేధిస్తున్నారని మౌనిక చెప్పారు. దాంతో వారిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టారు. అత్తవారింటి నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని మౌనిక పోలీసులను కోరారు.
watch video :