జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక క్విజ్ ప్రోగ్రాం మొదలవ్వడం, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాంకి హోస్ట్ చేయడం అనేవి ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ ప్రోగ్రాంకి దర్శకులు రాజమౌళి, కొరటాల శివ అతిథులుగా రాబోతున్నారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో విడుదల అయ్యింది.
Watch video :
https://www.youtube.com/watch?v=1_ltHx3em7Q&ab_channel=Fukkard












