ఎవరైనా భార్య డెలివరీ కి వెళ్తే.. ఎప్పుడు తిరిగి వస్తుందా.. తన పిల్లని ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ.. ఈ ప్రబుద్ధుడు మాత్రం భార్య డెలివరీ కి వెళ్లి, తిరిగి వచ్చేలోపు మరో పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్ కు చెందిన మహమ్మద్ జావేద్ కు గతంలోనే పెళ్లయింది. ఆమె డెలివరీ కి వెళ్లిన సమయం లో రెండో పెళ్ళికి సిద్ధం అయ్యాడు.

ఈ నెల 25 న జగద్గిరి గుట్టకు చెందిన అమ్మాయి తో జావేద్ కు వివాహం జరుగుతోందని తెలుసుకున్న అతని భార్య.. వధువు తరపు బంధువులకు సమాచారం ఇచ్చింది. దీనితో అసలు విషయం తెలుసుకున్న వారు జావేద్ ను పహాడీ షరీఫ్ పోలీసులకు అప్పచెప్పారు.









