కరోనా గడ్డుకాలం లో ఎవరు చేయలేనంత సాయాలు చేస్తూ సోనూసూద్ చాలా మందికి అండగా నిలబడ్డారు. మొదటి వేవ్ లాక్ డౌన్ సమయం లో వలస బాధితుల్ని స్వస్థలానికి చేర్చుతూ ప్రారంభించిన ఆయన నేటికీ తన సేవల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరైనా అవసరం ఉందంటే చాలు.. లేదు అనకుండా తనకు తోచిన సాయం చేస్తున్నారు.
అవసరమైన వారికీ తన స్నేహ హస్తాన్ని అందిస్తూ కలియుగ కర్ణ అనిపించుకుంటున్నారు. అయితే.. కొందరు కొంటె నెటిజన్లు మాత్రం తమ కొంటె బుద్ధి ని పోనిచ్చుకున్నారు కాదు. సోనూసూద్ ని ట్విట్టర్ మాధ్యమం లో చిలిపి సాయాలను అడుగుతున్నారు. వాటిని సోనూసూద్ కూడా సీరియస్ గా తీసుకోకుండా.. ఫన్నీ ఆన్సర్ లను ఇస్తున్నారు. తాజాగా మరో ట్వీట్ వైరల్ అయింది.
ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్..” భయ్యా.. నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనిమ్మని అడుగుతోంది.. మీరేమైనా హెల్ప్ చేస్తారా? అని ట్వీట్ చేసి సోనూసూద్ ని టాగ్ చేసాడు. దానికి సోనూసూద్ కూడా స్పందించారు.. “అది అవుతుందో లేదో తెలియదు కానీ.. ఐఫోన్ కొనిస్తే మాత్రం నీ దగ్గర ఇంకేమి మిగలదు..” అంటూ సరదాగా బదులిచ్చారు.
उसका तो पता नहीं,
अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा? https://t.co/t99rnT8z22— sonu sood (@SonuSood) June 22, 2021