ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, సమయం కథనం ప్రకారం 45 సంవత్సరాల ఉద్దంటి సాయిబాబు విజయవాడలోని పటమటలంక పుట్ట రోడ్ లో నివసిస్తూ ఉంటారు. సాయిబాబు అక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నారు.

representative image
అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా, కొంత కాలంగా సాయిబాబుకి మానసిక పరిస్థితి బాగుండడం లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్లి ఒకటి, రెండు రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన బీసెంట్ రోడ్ లోని తన స్నేహితుడి దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటికి వెళ్లారు సాయిబాబు. సాయిబాబు ఇంటికి తిరిగి రాకపోవడంతో శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతికారు.

representative image
ఆదివారం ఉదయం పెదపులిపాక వద్ద కరకట్టపై చెట్టుకు ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతోంది అని స్థానికులు చెప్పడంతో సాయిబాబు భార్య కృష్ణవేణి అక్కడికి వెళ్లి పరిశీలించి, అక్కడ ఉన్నది సాయిబాబు అని గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, సాయిబాబు రాసినట్టుగా ఆయన చొక్కా జేబులో ఒక లేఖ లభ్యమయింది. ఆ లేఖలో ఈ విధంగా రాసి ఉంది.

image credits: samayam telugu
అయ్యా, యు. సాయిబాబు అనే నేను పడమటలంకలో ఉంటాను. నా అనారోగ్యం మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను చనిపోవుచున్నాను. నా చావుకు ఎవరూ కారణం కాదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లీడుకి వచ్చి ఉన్నారు. నా భార్య, పిల్లల్ని దిక్కులేని వాళ్ళను చేసి నేను వెళ్ళిపోతున్నాను. మీకు సహాయం చేయాలనిపిస్తే నా భార్యకు వడ్డీ కట్టే బాధను తగ్గించండి. మీ పాదాలకు నమస్కారములు.

representative image
నేను ఈ లెటర్ అసలు నా చివరి కోరిక గురించి రాస్తున్నాను. మీరు నా చివరి కోరిక తీర్చకపోతే ఈ లెటర్ కు అర్థమే లేదు. అందుకే ఎవరి ఫోన్ నెంబర్ రాయడం లేదు. నా చివరి కోరిక. నా బాడీని మాత్రం ఎవరికీ ఇవ్వద్దు. అనాధ శవం దొరికితే మీరు ఎలా కాల్చేస్తారో అలాగే నా శవాన్ని కూడా అలాగే కాల్చేయండి. నా భార్య గాని, అత్తమామలు గాని, అక్క బావలు గాని, ఫ్రెండ్స్ గాని ఎవరు అడిగినా నా బాడీ మాత్రం ఇవ్వవద్దు.

representative image
వీళ్ళందరూ పైకి బాధపడినా, మీరు బాడీ ఇవ్వనంటే మనసులో చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఖర్చు తప్పుతుంది గదా. ఇప్పటికే మీకు అర్థమైయి ఉంటుంది. నా చివరి కోరిక తీర్చకపోతే మీరు మీ వృత్తికి ద్రోహం చేసినట్లే. అని రాశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ లేఖ సాయిబాబు రాసినదేనా లేక ఇంకెవరైనా ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.









































