టాలీవుడ్ హీరోలు అయినటువంటి హీరో వెంకటేష్ రానాపై పోలీస్ కేసు నమోదు చేయాలి అంటూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారి చేసింది. వెంకటేష్ రానా పై మాత్రమే కాకుండా హీరో అభిరామ్ పై కూడా చర్యలు తీసుకోవాలని వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. వీరిపై డెక్కన్ కిచెన్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబోతున్నట్టు తెలుస్తుంది.
సాక్షి కథనం ప్రకారం..ఫిలింనగర్ లో ఉన్నటువంటి డెక్కన్ కిచెన్ కూల్చి వేసినటువంటి తరుణంలో యజమాని నందకుమార్ నేడు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి డెక్కన్ కిచెన్ ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లారని నందకుమార్ తెలిపారు. సుమారు 60 మంది ప్రవేట్ బౌన్సర్లను పెట్టుకొని కిచెన్ కూల్చివేయడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ తరలించాలని ఈయన వెల్లడించారు.
ఈ కిచెన్ లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నాయి అయినప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మరి ఈ కిచెన్ ధ్వంసం చేశారు. ఇలా ఈ కిచెన్ నాశనం చేయటం వల్ల తనకు సుమారు 20 కోట్ల వరకు ఆస్తి నష్టం వచ్చిందని నందకుమార్ వెల్లడించారు. ఇలా ఈయన దగ్గుబాటి హీరోలపై ఫిర్యాదు చేయడంతో నాంపల్లి కోర్టు వీరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం వీరిపై ఐపిసి 448,452, 380,506120 b కింద కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.