AYODHYA: ఇప్పటివరకు అయోధ్య రామ మందిర హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

AYODHYA: ఇప్పటివరకు అయోధ్య రామ మందిర హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?

by Mounika Singaluri

Ads

అయోధ్య బాల రాముని మందిరం ప్రారంభోత్సవం జరిగి బాల రాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత రాములవారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలలు నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఇప్పటికే బాల రాముని దర్శన వేళలను రామ మందిరం ట్రస్ట్ ప్రకటించింది. అలాగే దేశాన్ని నలుమూలల నుండి కూడా రైల్వే డిపార్ట్మెంటు, ఏరోప్లేన్ సంస్థలు కూడా తమ సర్వీస్ లను ప్రారంభించి షెడ్యూల్లను విడుదల చేశాయి.

Video Advertisement

అయోధ్యలో టెంపుల్ టూరిజం తో పాటు హోటల్లు రెస్టారెంట్లు వ్యాపార సామ్రాజ్యాలు కూడా వెలిసాయి. ఇప్పుడు అయోధ్య దేశంలోనే నెంబర్ వన్ స్పాట్ గా నిలిచింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగినా తర్వాత 11 రోజులలో రాములవారిని 25 లక్షల మంది దర్శించుకున్నారట. దర్శించుకోవడంతో పాటు అధిక సంఖ్యలో హుండీలో కానుకలు కూడా వేశారట.ఈ విషయం పైన రామ మందిరం నిర్మాణం ట్రస్ట్ కార్యాలయం ఇంచార్జ్ గుప్తా పలు విషయాలను తెలియజేశారు.


రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో గత 10 రోజుల్లో సుమారు ₹8 కోట్లు విరాళాలు హుండీల్లో జమ అయ్యాయని, ఆన్‌లైన్‌లో సుమారు ₹3.50 కోట్లు అందాయని తెలిపారు.స్వామి కొలువై ఉన్న గర్భగుడి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల బాక్స్‌లను ఉంచామని, అందులో భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు.

ఇక ఈ విరాళాలు లెక్కింపు కార్యక్రమం 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా 14 మంది ఉద్యోగుల బృందం ఆధ్వర్యంలో జరుగుతుంది. విరాళాలు లెక్కించడం అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయని గుప్తా తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో రామ మందిరం నుంచి భక్తులు తాకిడి పెరిగి మరింత అధిక సంఖ్యలో విరాళాలు వస్తాయని అంటున్నారు.


End of Article

You may also like