అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. రామరాజు ఫర్ భీమ్ టీజర్ కూడా విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా ఉంది. అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఎదురు చూడడానికి, ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి.ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్రీమ్ కాంబినేషన్, రాజమౌళి దర్శకత్వం, తో సినిమా అభిమానుల్లో మొదలైన ఎగ్జైట్మెంట్, తర్వాత ఐదు భాషల్లోనూ విడుదలైన మోషన్ పోస్టర్,ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో, అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆర్ టీం నుండి వచ్చే అప్డేట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కొంచెం గా పెరుగుతూనే ఉంది.
ఇవాళ విడుదలైన టీజర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా టీజర్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగబోతోంది అని అనిపించేలా ఉన్నాయి. పైన మీరు చూస్తున్న షాట్ ఇవాళ విడుదలైన రామరాజు ఫర్ భీమ్ టీజర్ లోనిది.ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో వాల్కనోస్ 101 అనే నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ లోనిది. ఇది దాదాపు తొమ్మిది నెలల క్రితం విడుదలయింది. రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా? చాలామందికి ఇదే అనిపించడంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పాయింట్ అవుట్ చేశారు.
Ramaraju For Bheem – Bheem Intro – RRR (Telugu)
RRR Shots Video
RRR Shots Video 2
RRR Shots Video 3
https://www.youtube.com/watch?v=HcI60TEphGo
వీటిని పూర్తిగా కాపీ అని అనలేం. ఎందుకంటే ఆన్లైన్ లో ఇలాంటి ఫోటోలు, ఇంకా వీడియోలు షట్టర్ స్టాక్ ఇంకా కొన్ని వెబ్ సైట్స్ లో దొరుకుతాయి. వీటికి కొంత మొత్తం చెల్లించి ఉపయోగించుకోవచ్చు. హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాగే పే చేసి కొన్ని వీడియోస్, ఫోటోలు తీసుకుంటారు.