తిరిగే కాలు, తిట్టే నోరు ఊరికే ఉండవు అని ఒక సామెత.. లాక్ డౌన్ తో ఒక్కసారిగా కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోపెట్టినట్టుగా ఉంది కొందరికి..దాంతో రకరకాల సాకులతో ఇంటి నుండి బయటకి వస్తున్నారు. బయట పోలీసులు ఊరుకుంటారా? లాఠీలకు బుద్ది చెప్తున్నారు. ఇలా అయితే కాదని ఒక పక్కా ప్లాన్ తో ఇంటి నుండి బయటకి వచ్చారు. వైజాగ్ లో ఒక జంట.. ఇంతకీ వీళ్లు వేసిన ప్లాన్ కి మనకి కూడా బుర్ర తిరిగిపోతుంది.

విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన దంపతులు బైక్పై బయటకు వచ్చారు . పోలీసులు ఆపడంతో తమ బిడ్డకు సీరియస్గా ఉందని చెప్పారు. పోలీసులు కూడా నిజమే అనుకుని వదిలేశారు. అక్కడి నుంచి బయల్దేరి NAD జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడా పోలీసులు బైక్ను ఆపడంతో వారికి కూడా మళ్లీ అదే కారణం చెప్పారు. కానీ భార్యాభర్తల తీరుపై ఒక కానిస్టేబుల్కు అనుమానం వచ్చింది.

ఒకసారి పాపను చూపించండి అంటూ మహిళ దగ్గరకు వెళ్లాడు. ముందు బిడ్డను చూపించడానికి నిరాకరించిన మహిళ, తర్వాత చూపించడంతో పోలీసులు అవాక్కయ్యారు.. అక్కడ ఉన్నది పాప కాదు బొమ్మ, పోలీసులకు మస్కా కొట్టడానికి వారు వేసిన ప్లాన్ కి ఖంగుతిన్నారు.వెంటనే తేరుకుని సీరియస్ అయ్యేసరికి వెంటనే మహిళ మాట మార్చేసింది. తమ బంధువు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, చూడడానికి వెళ్తున్నామని ,ఒక్కసారికి అనుమతించమని కోరింది.

representative image
అడిగింది మహిళ కదా పోలీసులు ఏమీ అనలేక, మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించి పంపేశారు . బంధువుకి అనారోగ్యం అనేది నిజమే అయితే, అత్యవసరం అయితే ప్రభుత్వాలే అనుమతిస్తున్నాయి..ఇంత ప్లాన్ వేయాల్సిన అవసరం ఏముంది..అయినా పోలీసులు ఊరుకున్నారు కాని..కరోనా ఊరుకోదు తల్లి.. మీరు పోలీసులతో ఆటలాడితే, కరోనా మీతో గేమ్స్ ఆడుతుంది..జాగ్రత్తా..







ఇకపోతే మన దేశానికి ….పెద్ద మహమ్మారిలా మారింది లాక్ డౌన్ కారణంగా అటు సినీ రంగం..ఇటు టీవీ రంగం కూడా షూటింగ్స్ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది..తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు..ఇలాంటి వృత్తినే నమ్ముకున్న ఆర్టిస్టుల కష్టాలు అన్ని ఇన్ని కావు..వేళ్ళని ఆదుకోవడనికి ఇంకా ఎవ్వరు ముందు రాలేదు.ఇక బుల్లి తెర సంచలనం ‘జబర్దస్త్’ ఎంత పేరు ని సంపాదించుకుందో అందరికి తెలియనిది కాదు.స్కిట్ ల మీదే ఆధార పడి బ్రతుకుతున్న వారు ఎందరో…వీరిలో ఒకరు అయిన జబర్దస్త్ కమెడియన్ జీవన్ తన రైతు వృత్తినే ఎన్నుకున్నారు.



రైళ్లు ,సబర్బన్ రైళ్ల రద్దు ని మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది కరోనా వైరస్ నివారించే భాగంగా లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగించడం తో రైల్వే శాఖ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. పార్సిల్ , సరకు రవాణా కి ఎటువంటి ఆటకం ఉండదు అంటూ ప్రకటించింది. రైలు టిక్కెట్ల కోసం స్టేషన్లకు రావొద్దు అంటున్నారు. లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చికుక్కున విద్యార్థులు,పర్యాటకులు,వలస కార్మికులు,తీర్థయాత్రికులు, మరే ఇతర కారణాల చేత చిక్కుకున్న ప్రయాణికులు శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా తమ స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయబోతునన్టు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మేరకు ,కేంద్ర హోమ్ శాఖ మార్గ దర్శకాలనులోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపబోతుననట్టుగా తెలిపింది.ఈ రైళ్లలో ప్రయాణదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవల్సిందిగా సూచించారు.రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రకటించింది వ్యక్తులకి టిక్కెట్లను విడివిడిగా ఇవ్వడం కుదరదు బృందాలకు కూడా టికెట్లు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి టిక్కెట్ల కోసం నేరుగా రైల్వే స్టేషన్లకు దయచేసి రావద్దు అని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తున్నారు.














