ఒకవైపు ప్రపంచం కరోనా భయంతో వణికిపోతుంటే..మరోవైపు సోషల్ మీడియా ప్రపంచం ఫేక్ న్యూస్ తో వణికి పోతుంది.. దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నేడు..దాంతో ఎవరికైనా హెల్త్ బాగోలేదనే సమాచారం వస్తే చాలు వెంటనే దాన్ని కరోనా ఖాతాలో వేసేస్తోంది..ఇంకేం ఇబ్బడి ముబ్బడిగా శేరైపోతూ సదరు వ్యక్తికి కొత్త తలనొప్పులు తెస్తుంది..తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు నటి పాయల్ ఘోష్..

మంచు మనోజ్ “ప్రయాణం”చిత్రంతో టాలివుడ్ కి పరిచయం అయిన ఈ భామ..తర్వాత ఎన్టీఆర్ తో “ఊసరవెల్లి”లో నటించింది.చేసినవి రెండు చిత్రాలే అయినా గుర్తుండిపోయే ఫేసే.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పాయల్ ని, హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. దీనితో ఆమెకి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది..తనపై వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టింది పాయల్..

“నేను గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట వాస్తవమే.. నాకు ముందుగా తలనొప్పి ప్రారంభమై తర్వాత జ్వరం వచ్చింది. దీంతో నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించారు. టెస్టుల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్ త్వరలోనే ముగుస్తుందని బలంగా నమ్ముతున్నా. అతి త్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నమ్ముతున్నాను” అంటూ వెల్లడించింది.

కొందరు చేసిన పనిని చెయ్యలేదు అంటూ…చెయ్యని పనిని చేశాను అంటూ వాపోతుంటారు ..అది వాస్తవమే..కానీ చేసిన పనులు ఒప్పుకోవాలి అంటే నిజంగా గట్స్ ఉండాలి అనే చెప్పాలి…అసలు విషయానికి వస్తే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వలన సెలెబ్రిటీలు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే..దొరికిన ఈ కాస్త సమయాన్ని సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు ..ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ కి లైవ్ లో చిట్ చాట్ చేసిన హర్ తేజ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు..
మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.













ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎదుటి వారికీ సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు సుమ .మానవత్వం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు ..సుమ కనకాల మంచి మనసును నెటిజన్లు అందరు ప్రశంసిస్తున్నారు ..





