రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారంలో రెండు రోజులు, మంగళవారం, శుక్రవారాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్ణయించింది. దీంతో గత శుక్రవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్ కి ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది.
తెలంగాణ నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా భవన్‌కు చేరుకున్నారు. దాంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. గతంలో ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళా హోంగార్డు తన జాబ్ ని మళ్ళీ ఇప్పించమంటూ, ప్రజా దర్బార్ కి వెళ్ళి తన బాధను వెళ్లబోసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను చెప్పుకోవడానికి శుక్రవారం నాడు భారీగా ప్రజలు తెల్లవారక ముందే ప్రజా భవన్‌కు వచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వారిలో మహిళా హోంగార్డు మామిడి పద్మ కూడా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందని, దానిని తిరిగి ఇప్పించమని అడగడానికి ఆమె ప్రజా దర్బార్ కి వచ్చారు.
ఉద్యోగం పోవడంతో జీవనోపాధి లేకుండా పోయిందని, దాంతో కుటుంబ పోషణ కూడా భారమైందని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నందున తనకు మళ్లీ హోంగార్డు ఉద్యోగం ఇప్పించాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. 2016లో తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగానికి భద్రత ఏర్పరచాలనే డిమాండ్‌తో హోంగార్డులందరు స్ట్రైక్ చేశారు. వారిలో గోదావరిఖనికి చెందిన మామిడి పద్మ కూడా ధర్నాలో పాల్గొని గత ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. అందుకు ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. భర్త వదిలేయడం, ఉద్యోగం పోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఆమెకు సమస్యగా మారింది. తన జాబ్ ను తిరిగి ఇప్పించమని సీపీ, డీజీపీ, హోంమినిస్టర్ ను వేడుకున్నారు.
మామిడి పద్మ 2009లో వేములవాడలో హోంగార్డుగా జాయిన్ అయ్యారు. రెండేళ్ళ తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్ఫర్ పైన వెళ్లారు. తమ జీతాలు పెంచడంతో పాటు, ప్రతినెలా జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 7 ఏళ్ళ క్రితం ఇతర జిల్లాల నుండి వచ్చిన హోంగార్డులు గాంధీ ఆస్పత్రి దగ్గర ధర్నా చేశారు. దీనిలో పాల్గొన్నందుకు మామిడి పద్మ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన బాధను చెప్పుకోవడానికి ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పించాలని వేడుకున్నారు.
Also Read: వంట మనిషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్..! ఎందుకంటే..?






ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి భోజనం వచ్చిందట. ఆ విషయాన్ని ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషి రేవంత్ రెడ్డికి చెప్పారట. ఆ విషయం విన్న ఆయన ఇలా అయితే పనిలో నుంచి నిన్ను తీసేయాల్సి వస్తుందని తన వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. ప్రోటోకాల్ వంటివి వద్దని, తాను ఇంటి భోజనమే తింటానని, ఎప్పటిలాగే చేయమని తన వంట మనిషికి చెప్పారంట.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్ ను ప్రజా భవన్‌గా మార్చిన విషయం తెలిసిందే. ప్రజావాణి కార్యక్రమంను అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉండేది. ప్రస్తుతం దాన్ని డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ జూబ్లీహిల్స్‌లో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.


స్మితా సబర్వాల్ 1977 లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో బెంగాలీ ఫ్యామిలిలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్, పురబీ దాస్‌లకు జూన్ 19న జన్మించారు. ఆమె సికింద్రాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్‌లో పట్టా తీసుకున్నారు. 2000లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసిన ఆమె, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు.
2001లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేసింది. తన ప్రొబేషన్ టైమ్ లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్‌గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడప డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మునిసిపల్ కమీషనర్‌గా పనిచేశారు. ఆమె “ఫండ్ యువర్ సిటీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌లు, బస్-స్టాప్‌లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) క్రియేట్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. 2011 ఏప్రిల్ లో, సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాప్‌లు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.
2012–2013లో ప్రధానమంత్రి 20 పాయింట్ల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లాగా అవార్డు పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆమె కలెక్టర్ గా కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో చేసే తప్పులు చేసి, ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం ఫ్యాషన్ అయ్యిందని, ఆమెని వెళ్ళకుండా చూడాలని ‘దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న వైసీపీ, తాజగా 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను మార్చింది. కొండెపి- ఆదిమూలపు సురేష్, మంగళగిరి- గంజి చిరంజీవి, ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, వేమూరు- వరికూటి అశోక్ బాబు,సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ- మేకతోటి సుచరిత, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, గాజువాక- వరికూటి రామచంద్రరావు, రేపల్లె- ఈవూరు గణేష్ లను ఇన్చార్జులగా నియమించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను తాజాగా కొండెపికి ఇన్చార్జిగా మార్చడం చర్చకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుడు డోలా బాలవీరాంజనేయస్వామి స్థానం ఇది. 2014 మరియు 2019 ఎలెక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.
కొండెపికి ఇన్చార్జిగా మార్చడం పై తాజాగా ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. నియోజకవర్గ మార్పు విషయంలో పార్టీ నిర్ణయమే పాటిస్తానని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, సైనికుడిలా పార్టీ విజయం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు కెప్టెన్ అని అన్నారు. కొండెపి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
