ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు ఆదివారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి సోమవారం శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శ్రీకాంత్‌ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.

పరమేశ్వరరావు గారి సొంత ఊరు కృష్ణా జిల్లా లోని మేకవారిపాలెం. 1948 మార్చి 16న ఆయన జన్మించారు. కొంత కాలానికి పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మేక పరమేశ్వరరావు గత నాలుగు మాసాలుగా స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
watch video:




















