తిరుమలలో ఉండే రద్దీ గురించి అందరికి తెలిసిందే. ఏడుకొండలపై నెలకొన్న వెంకటేశ్వరా స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండే కాదు విదేశాలనుండి కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు. స్పెషల్ దర్శనం కావాలంటే కనీసం రెండు నెలల ముందైనా టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక సెలవు రోజుల్లో ఐతే ఈ రద్దీ మరింతగా ఉంటుంది.
కానీ గత రెండు రోజుల నుండి సీన్ రివర్స్ అయ్యింది. జనాలు ఎక్కువ లేకపోవడంతో కొండంతా కాలిగా ఉంది. సాధారణంగా పది గంటలు పట్టే సర్వదర్శనం ఇప్పుడు రెండు గంటల్లో అయిపోతుంది. ఒకటి రెండు క్యూ కాంప్లెక్సులు మాత్రమే నిండే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. నిన్న(బుధవారం) శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం వచ్చింది.
మొత్తం మీద నిన్న శ్రీవారిని 70, 712 మంది భక్తులు దర్శించుకున్నారు.సంక్రాంతి సెలవులు ముగిసి వారం రోజులు అవ్వడంతో అందరు బిజీ అయిపోయారు. అందుకే రద్దీ తక్కువగా ఉంది అనుకుంటున్నారు. మళ్ళీ ఈ వారాంతంలో నిండే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే సెలవు కూడా ఉండడంతో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు.